More
    Homeబిజినెస్​Pre Market Analysis | ట్రంప్‌ ఎఫెక్ట్‌.. పరుగులు పెడుతున్న స్టాక్‌ మార్కెట్లు.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను...

    Pre Market Analysis | ట్రంప్‌ ఎఫెక్ట్‌.. పరుగులు పెడుతున్న స్టాక్‌ మార్కెట్లు.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis : గ్లోబల్‌ మార్కెట్లు(Global market) లాభాల బాట పట్టాయి. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇరాన్‌, ఇజ్రాయిల్‌ మధ్య సీజ్‌ ఫైర్‌ ప్రకటన చేసిన తర్వాత యూఎస్‌ మార్కెట్లు ర్యాలీ తీశాయి. మంగళవారం ఉదయం ఆసియా మార్కెట్లు వాటికి జత కలిశాయి.

    Pre Market Analysis : యూఎస్‌ మార్కెట్లు(US Markets)..

    యూఎస్‌(US) జాబ్‌ మార్కెట్‌కు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుండడంతో వడ్డీ రేట్లను తగ్గించే సమయం సమీపిస్తోందని ఫెడ్‌ వైస్‌చైర్మన్‌ బౌమాన్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో యూఎస్‌ ఫెడ్‌ ముందస్తుగానే అంటే జూలైలోనే వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలున్నాయన్న ఆశతో వాల్‌స్ట్రీట్‌ పరుగులు తీసింది. గత ట్రేడింగ్‌ సెషన్‌లో ఎస్‌అండ్‌పీ 0.96 శాతం, నాస్‌డాక్‌(Nasdaq) 0.94 శాతం పెరిగాయి. మంగళవారం ఉదయం డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ సైతం 0.48 శాతం లాభంతో ఉంది.

    READ ALSO  CNG bike | తొలి సీఎన్‌జీ బైక్‌పై భారీ డిస్కౌంట్‌.. వార్షికోత్సవ ఆఫర్‌ ప్రకటించిన బజాజ్‌

    Pre Market Analysis : యూరోప్‌ మార్కెట్లు(European markets)..

    మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల ప్రభావంతో యూరోప్‌ మార్కెట్లు సోమవారం నష్టాలతో ముగిశాయి. సీఏసీ(CAC) 0.69 శాతం, డీఏఎక్స్‌ 0.35 శాతం, ఎఫ్‌టీఎస్‌ఈ 0.19 శాతం నష్టపోయాయి.

    Pre Market Analysis : ఆసియా మార్కెట్లు(Asian markets)..

    సీజ్‌ఫైర్‌(Cease fire)కు ఇజ్రాయిల్‌, ఇరాన్‌ అంగీకరించాయన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటన గ్లోబల్‌ మార్కెట్లకు బూస్ట్‌ ఇచ్చింది. ట్రంప్‌ ప్రకటనతో ముడి చమురు ధరలు పడిపోయాయి. దీంతో ఆసియా మార్కెట్లు లాభాలబాటలో పయనిస్తున్నాయి. ఉదయం 7.50 గంటల సమయంలో కోస్పీ(Kospi) 2.25 శాతం, తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 1.90 శాతం, హంగ్‌సెంగ్‌ 1.63 శాతం, నిక్కీ 1.04 శాతం, షాంఘై 0.90 శాతం, స్ట్రెయిట్స్‌ టైమ్స్‌ 0.58 శాతం లాభాలతో ఉన్నాయి. గిఫ్ట్‌ నిఫ్టీ(Gift nifty) ఒక శాతానికిపైగా లాభంతో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు భారీ గ్యాప్‌ అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    READ ALSO  Stock Market | మిడిల్‌ ఈస్ట్‌లో మళ్లీ టెన్షన్స్‌.. ఆవిరైన ప్రారంభ లాభాలు

    Pre Market Analysis : గమనించాల్సిన అంశాలు..

    • ఎఫ్‌ఐఐలు వరుసగా నాలుగో రోజూ నికర కొనుగోలుదారులుగా నిలిచారు. శుక్రవారం నికరంగా రూ. 1,874 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించారు. డీఐఐ(DII)లు నికరంగా రూ. 5,591 కోట్ల విలువైన స్టాక్స్‌ కొన్నారు.
    • నిఫ్టీ పుట్‌కాల్‌ రేషియో(PCR) 1.16 నుంచి 1.04కు తగ్గింది. విక్స్‌(VIX) 2.74 శాతం పెరిగి 14.05కు చేరింది.
    • బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌(Crude oil) ధర బ్యారెల్‌కు 0.42 శాతం పెరిగి 69.83 డాలర్ల వద్ద ఉంది.
    • డాలర్‌తో రూపాయి(Rupee) మారకం విలువ 15 పైసలు బలహీనపడి 86.75 వద్ద ఉంది.
    • యూఎస్‌ డాలర్‌ ఇండెక్స్‌ 0.18 శాతం తగ్గి 98.24 వద్ద ఉండగా.. యూఎస్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 0.07 శాతం పెరిగి 4.35 వద్ద నిలిచింది.
    READ ALSO  Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Latest articles

    Govt Employees | ఉద్యోగుల బదిలీలపై నిషేధం.. కారణం ఇదే..!

    అక్షరటుడే, హైదరాబాద్: Govt Employees : తెలంగాణ ప్రభుత్వం(Telangana state government) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల...

    Puri Jagannath Rath Yatra | తరిద్దాం శ్రీ కృష్ణుడి సేవలో.. నేడు పూరి జగన్నాథ రథయాత్ర

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Puri Jagannath Rath Yatra : శ్రీకృష్ణుడు(Sri Krishna) తన తోబుట్టువులతో కలిసి కొలువుదీరిన మహిమాన్విత...

    Vijay Deverakonda | సక్సెస్, డబ్బు, రెస్పెక్ట్.. ఈ మూడే కిక్ ఇచ్చేవి : విజయ్ దేవరకొండ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Vijay Deverakonda : జీవితంలో ప్రతి ఒక్కరికీ కిక్ ఇచ్చేవి సక్సెస్, మనీ, రెస్పెక్ట్ మాత్రమేనని...

    Indira Canteens | ఇందిరా క్యాంటీన్లుగా అన్నపూర్ణ భోజన కేంద్రాలు.. ఇకపై టిఫిన్ కూడా..

    అక్షరటుడే, హైదరాబాద్: Indira Canteens : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరంలో కేవలం రూ.5 కే...

    More like this

    Govt Employees | ఉద్యోగుల బదిలీలపై నిషేధం.. కారణం ఇదే..!

    అక్షరటుడే, హైదరాబాద్: Govt Employees : తెలంగాణ ప్రభుత్వం(Telangana state government) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల...

    Puri Jagannath Rath Yatra | తరిద్దాం శ్రీ కృష్ణుడి సేవలో.. నేడు పూరి జగన్నాథ రథయాత్ర

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Puri Jagannath Rath Yatra : శ్రీకృష్ణుడు(Sri Krishna) తన తోబుట్టువులతో కలిసి కొలువుదీరిన మహిమాన్విత...

    Vijay Deverakonda | సక్సెస్, డబ్బు, రెస్పెక్ట్.. ఈ మూడే కిక్ ఇచ్చేవి : విజయ్ దేవరకొండ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Vijay Deverakonda : జీవితంలో ప్రతి ఒక్కరికీ కిక్ ఇచ్చేవి సక్సెస్, మనీ, రెస్పెక్ట్ మాత్రమేనని...