Site icon aksharatoday.in

Pre Market Analysis | ట్రంప్‌ ఎఫెక్ట్‌.. పరుగులు పెడుతున్న స్టాక్‌ మార్కెట్లు.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

Stock Market

Pre Market Analysis | ట్రంప్‌ ఎఫెక్ట్‌.. పరుగులు పెడుతున్న స్టాక్‌ మార్కెట్లు.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis : గ్లోబల్‌ మార్కెట్లు(Global market) లాభాల బాట పట్టాయి. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇరాన్‌, ఇజ్రాయిల్‌ మధ్య సీజ్‌ ఫైర్‌ ప్రకటన చేసిన తర్వాత యూఎస్‌ మార్కెట్లు ర్యాలీ తీశాయి. మంగళవారం ఉదయం ఆసియా మార్కెట్లు వాటికి జత కలిశాయి.

Pre Market Analysis : యూఎస్‌ మార్కెట్లు(US Markets)..

యూఎస్‌(US) జాబ్‌ మార్కెట్‌కు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుండడంతో వడ్డీ రేట్లను తగ్గించే సమయం సమీపిస్తోందని ఫెడ్‌ వైస్‌చైర్మన్‌ బౌమాన్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో యూఎస్‌ ఫెడ్‌ ముందస్తుగానే అంటే జూలైలోనే వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలున్నాయన్న ఆశతో వాల్‌స్ట్రీట్‌ పరుగులు తీసింది. గత ట్రేడింగ్‌ సెషన్‌లో ఎస్‌అండ్‌పీ 0.96 శాతం, నాస్‌డాక్‌(Nasdaq) 0.94 శాతం పెరిగాయి. మంగళవారం ఉదయం డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ సైతం 0.48 శాతం లాభంతో ఉంది.

Pre Market Analysis : యూరోప్‌ మార్కెట్లు(European markets)..

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల ప్రభావంతో యూరోప్‌ మార్కెట్లు సోమవారం నష్టాలతో ముగిశాయి. సీఏసీ(CAC) 0.69 శాతం, డీఏఎక్స్‌ 0.35 శాతం, ఎఫ్‌టీఎస్‌ఈ 0.19 శాతం నష్టపోయాయి.

Pre Market Analysis : ఆసియా మార్కెట్లు(Asian markets)..

సీజ్‌ఫైర్‌(Cease fire)కు ఇజ్రాయిల్‌, ఇరాన్‌ అంగీకరించాయన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటన గ్లోబల్‌ మార్కెట్లకు బూస్ట్‌ ఇచ్చింది. ట్రంప్‌ ప్రకటనతో ముడి చమురు ధరలు పడిపోయాయి. దీంతో ఆసియా మార్కెట్లు లాభాలబాటలో పయనిస్తున్నాయి. ఉదయం 7.50 గంటల సమయంలో కోస్పీ(Kospi) 2.25 శాతం, తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 1.90 శాతం, హంగ్‌సెంగ్‌ 1.63 శాతం, నిక్కీ 1.04 శాతం, షాంఘై 0.90 శాతం, స్ట్రెయిట్స్‌ టైమ్స్‌ 0.58 శాతం లాభాలతో ఉన్నాయి. గిఫ్ట్‌ నిఫ్టీ(Gift nifty) ఒక శాతానికిపైగా లాభంతో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు భారీ గ్యాప్‌ అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Pre Market Analysis : గమనించాల్సిన అంశాలు..

Exit mobile version