More
    Homeక్రీడలుAnderson-Tendulkar Trophy | విజృంభించిన బెన్​ డకెట్​.. తొలి టెస్టులో టీమిండియా ఓటమి

    Anderson-Tendulkar Trophy | విజృంభించిన బెన్​ డకెట్​.. తొలి టెస్టులో టీమిండియా ఓటమి

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Anderson-Tendulkar Trophy : అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్​ (England) తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్​లో టీమిండియా team India ఓటమి చెందింది. భారత్​ జట్టు Indian team నిర్దేశించిన 371 పరుగుల లక్ష్యాన్ని ఆతిథ్య ఇంగ్లండ్​ జట్టు 5 వికెట్లు కోల్పోయి అవలీలగా ఛేదించింది.

    ఓపెనర్ బెన్ డకెట్ Ben Duckett (149, 170 బంతుల్లో 21 ఫోర్లు, 1 సిక్స్) భారీ శతకంతో బంతిని ఓ ఆట ఆడుకున్నాడు. జాక్ క్రాలీ (65), జో రూట్ (53*; 84 బంతుల్లో 6 ఫోర్లు) హాఫ్ సెంచరీలు చేశారు. బెన్ స్టోక్స్ (33, 51 బంతుల్లో 4 ఫోర్లు) కూడా బెటర్​గానే రాణించాడు. చివరలో జేమీ స్మిత్ (44, 55 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లు) దూకుడు ప్రదర్శించాడు. భారత బౌలర్లలో ప్రసిద్ధ కృష్ణ 2, శార్దూల్ ఠాకూర్ 2, రవీంద్ర జడేజా ఒక వికెట్ తీసుకున్నారు.

    READ ALSO  Nitish Kumar Reddy | తొలి టెస్ట్ ఓట‌మితో రెండో టెస్ట్ కోసం టీమ్‌లో భారీ మార్పులు.. హైదరాబాద్ కుర్రాడికి పిలుపు!

    రెండో ఇన్నింగ్స్ లో 21/0 ఓవర్​నైట్​ స్కోరుతో అయిదో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు.. తొలి సెషన్​లో ఒక్క వికెట్టు కూడా కోల్పోకుండా 96 పరుగులు చేసింది. రెండో సెషన్​లో ఆతిథ్య జట్టు క్రికెటర్లు 152 పరుగులు చేసి నాలుగు వికెట్లు కోల్పోయారు.

    జాక్ క్రాలీ Jack Crawley, తర్వాత వచ్చిన ఓలీ పోప్ (8)ని ప్రసిద్ధి కృష్ణ పెవిలియన్​కు పంపించేశాడు. క్రాలీ, డకెట్ తొలి వికెట్​కు 188 పరుగుల భాగస్వామ్యంతో ఆడారు. డకెట్ 121 బంతుల్లోనే శతకం చేశాడు. సెంచరీ తర్వాత జోరు పెంచాడు. కానీ, టీ విరామానికి ముందే డకెట్, హ్యారీ బ్రూక్ (0)ను శార్దూల్ ఠాకూర్ ఔట్ చేశాడు.

    ఇక మ్యాచ్​ భారత్ చేతిలోకి వచ్చిందనుకునే తరుణంలో స్టోక్స్, రూట్ నిలకడగా ఆడి ఇన్నింగ్​ను వారి చేతుల్లోకి తీసుకున్నారు. జడేజా బౌలింగ్​లో స్టోక్స్ వెనుదిరిగినా రూట్, జేమీ స్మిత్ జట్టును నిలబెట్టారు.

    READ ALSO  India - England Match | భార‌త్‌కు ధీటుగా స‌మాధానం ఇస్తున్న ఇంగ్లండ్.. అంతా జ‌డేజా వల్లనే..!

    Latest articles

    Lady Conductor | ప్ర‌యాణికుడి చొక్కా ప‌ట్టుకొని కొట్టిన లేడి కండ‌క్ట‌ర్..కార‌ణం ఏంటంటే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Lady Conductor | ఓ లేడి కండ‌క్ట‌ర్ అంద‌రి ముందు ప్ర‌యాణికుడి చొక్కా ప‌ట్టుకొని కొట్ట‌డం...

    Engineering Admissions | విద్యార్థులకు అలర్ట్​.. ఇంజినీరింగ్​ కౌన్సెలింగ్​ షెడ్యూల్​ విడుదల

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Engineering Admissions | తెలంగాణ ఈఏపీ సెట్​ (ఇంజినీరింగ్‌) అడ్మిషన్స్‌ కౌన్సిలింగ్‌ షెడ్యూల్‌ విడుదల అయింది....

    Assembly Floor Leader | పదవి.. అధికారాన్ని కాపాడుకునేందుకే ఆ రోజుల్లో ఎమర్జెన్సీ..

    అక్షరటుడే, ఇందూరు: Assembly Floor Leader | తన పదవి, అధికారాన్ని కాపాడటం కోసం ఆ రోజుల్లో ఇందిరాగాంధీ...

    Prashanth Kishor | సీఎం రేవంత్​రెడ్డిపై ప్రశాంత్​ కిశోర్​ ఆగ్రహం.. ఎందుకో తెలుసా!

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Prashanth Kishor | ఎన్నికల వ్యూహకర్త, జన్​ సురాజ్​ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్​ కిశోర్​ తెలంగాణ...

    More like this