More
    HomeజాతీయంTraffic control | అక్కడ ట్రాఫిక్​ నియంత్రణ.. ఉల్లంఘనులకు జరిమానా ఇక ఏఐతోనే..!

    Traffic control | అక్కడ ట్రాఫిక్​ నియంత్రణ.. ఉల్లంఘనులకు జరిమానా ఇక ఏఐతోనే..!

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Traffic control : కొందరు వాహనదారులు రెడ్ సిగ్నల్ పడినా రోడ్డు దాటేస్తుంటారు. ఇంకొందరు అతివేగంగా వాహనాలు నడపడం, సీట్ బెల్ట్ ధరించకుండా ఫోర్​వీలర్ వెహికిల్​ డ్రైవ్ చేస్తుంటారు. ఇంకొందరు హెల్మెట్ పెట్టుకోకుండా బైక్​పై రయ్ మంటూ వెళ్లిపోతుంటారు.

    ఇలా అడ్డగోలుగా ట్రాఫిక్ నిబంధలు ఉల్లంఘించేవారి ఆటకట్టించేందుకు నాగ్​పుర్ మున్సిపల్ కార్పొరేషన్ చర్యలకు ఉపక్రమించింది. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించేవారిని ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ)(Artificial Intelligence – AI) సాయంతో గుర్తించి జరిమానాలు వేయబోతోంది.

    Traffic control : పది కూడళ్లలో…

    నగరంలో ట్రాఫిక్‌ ను నియంత్రించేందుకు నాగ్​పుర్ మున్సిపల్ కార్పొరేషన్ (Nagpur Municipal Corporation) ఏఐ ఆధారిత ‘ట్రాఫిక్ సిగ్నల్ సిస్టమ్’ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. తద్వారా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడానికి ప్రయత్నించే వారి వాహన నంబరు ప్లేట్​ను నేరుగా స్కాన్ చేసి, భారీ జరిమానాలు వేయనుంది.

    READ ALSO  Yoga day | ప్ర‌పంచ దేశాల‌ను ఏకం చేసిన యోగా.. విశాఖ‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ

    మహారాష్ట్ర(Maharashtra)లో మొదటి ఏఐ ఆధారిత సిగ్నల్ సిస్టమ్ ఇది. దీనిని మొదటి దశలో నాగ్​పూర్​ (Nagpur) లోని పది కూడళ్లలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు. జంక్షన్​ల వద్ద ఒకవైపు నుంచి వచ్చే వాహనాల సంఖ్య ఎక్కువగా పెరిగితే ఆ వైపు సిగ్నల్​ను కృత్రిమ మేధస్సు ఆటోమేటిక్​గా ఆకుపచ్చ రంగులోకి మార్చుతుంది. రోడ్డుపై వాహనాల రద్దీని పరిగణనలోకి తీసుకుని పరిస్థితిని బట్టి ఏఐ వ్యవస్థ స్వయంచాలకంగా పనిచేస్తుంది.

    ఈ ఏఐ ఆధారిత వ్యవస్థను ‘ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రాఫిక్ మేనేజ్​మెంట్ సిస్టమ్’ (‘Integrated Intelligence Traffic Management System’) అని కూడా పేర్కొంటారు. ఈ ప్రాజెక్టును నాగ్​పుర్ మున్సిపల్ కార్పొరేషన్ చేపడుతోంది. మొదట నగరంలోని పది జంక్షన్లలో, తర్వాత నగర వ్యాప్తంగా దశలవారీగా ఏఐ సిగ్నల్​ను విస్తరించనుంది.

    READ ALSO  Cyber ​​Crime | రూ. 2 వేల కోట్ల సైబర్‌ మోసం.. ఏకంగా చైనాతో లింకులు!

    ఇటీవలి కాలంలో నాగ్​పుర్​లో వాహనాలను అతివేగంగా నడిపేవారు పెరిగిపోయారు. ట్రాఫిక్ సిగ్నల్​ను ఉల్లంఘించేవారి సంఖ్య కూడా పెరిగిందని ఫిర్యాదులు అందుతున్నాయి. దీనికి పరిష్కారంగా ఈ ఏఐ సిగ్నల్ వ్యవస్థ(AI signal system)లో ‘వేగ ఉల్లంఘన గుర్తింపు’ (‘speed violation detection’) పరికరాన్ని అమర్చుతున్నారు. దీనికితోడు ఏఐ ఆధారిత కెమెరాల(AI-based cameras)ను బిగించుతున్నారు.

    Traffic control : ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రాఫిక్ మేనేజ్​మెంట్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే..

    ట్రాఫిక్ కూడలి వద్ద ఒక వైపు నుంచి వచ్చే వాహనాల సంఖ్య పెరిగిపోతే.. ఆ వైపు సిగ్నల్​ను ఏఐ వ్యవస్థ ఆకుపచ్చ రంగులోకి మార్చుతుంది. ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రాఫిక్ మేనేజ్​మెంట్ సిస్టమ్ ద్వారా సిగ్నల్ లైట్లు ఆటోమేటిక్​గా మారతాయి. ఈ వ్యవస్థ రోడ్డుపై ప్రయాణ సమయాన్ని 28 నుంచి 48 శాతానికి తగ్గిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రయాణ వేగం కూడా 62 శాతం పెరుగుతుందని భావిస్తున్నారు.

    READ ALSO  Kharge vs Tharoor | ఖర్గే వర్సెస్ థరూర్.. పరోక్ష విమర్శలు గుప్పించుకున్న నేతలు

    Latest articles

    Govt Employees | ఉద్యోగుల బదిలీలపై నిషేధం.. కారణం ఇదే..!

    అక్షరటుడే, హైదరాబాద్: Govt Employees : తెలంగాణ ప్రభుత్వం(Telangana state government) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల...

    Puri Jagannath Rath Yatra | తరిద్దాం శ్రీ కృష్ణుడి సేవలో.. నేడు పూరి జగన్నాథ రథయాత్ర

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Puri Jagannath Rath Yatra : శ్రీకృష్ణుడు(Sri Krishna) తన తోబుట్టువులతో కలిసి కొలువుదీరిన మహిమాన్విత...

    Vijay Deverakonda | సక్సెస్, డబ్బు, రెస్పెక్ట్.. ఈ మూడే కిక్ ఇచ్చేవి : విజయ్ దేవరకొండ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Vijay Deverakonda : జీవితంలో ప్రతి ఒక్కరికీ కిక్ ఇచ్చేవి సక్సెస్, మనీ, రెస్పెక్ట్ మాత్రమేనని...

    Indira Canteens | ఇందిరా క్యాంటీన్లుగా అన్నపూర్ణ భోజన కేంద్రాలు.. ఇకపై టిఫిన్ కూడా..

    అక్షరటుడే, హైదరాబాద్: Indira Canteens : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరంలో కేవలం రూ.5 కే...

    More like this

    Govt Employees | ఉద్యోగుల బదిలీలపై నిషేధం.. కారణం ఇదే..!

    అక్షరటుడే, హైదరాబాద్: Govt Employees : తెలంగాణ ప్రభుత్వం(Telangana state government) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల...

    Puri Jagannath Rath Yatra | తరిద్దాం శ్రీ కృష్ణుడి సేవలో.. నేడు పూరి జగన్నాథ రథయాత్ర

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Puri Jagannath Rath Yatra : శ్రీకృష్ణుడు(Sri Krishna) తన తోబుట్టువులతో కలిసి కొలువుదీరిన మహిమాన్విత...

    Vijay Deverakonda | సక్సెస్, డబ్బు, రెస్పెక్ట్.. ఈ మూడే కిక్ ఇచ్చేవి : విజయ్ దేవరకొండ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Vijay Deverakonda : జీవితంలో ప్రతి ఒక్కరికీ కిక్ ఇచ్చేవి సక్సెస్, మనీ, రెస్పెక్ట్ మాత్రమేనని...