అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: YS Rajasekhar Reddy | మాజీ సీఎం దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) ఉమ్మడి రాష్ట్రంలో చేసిన సేవలు మరువలేనివని.. రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ (Urdu Academy Chairman) తాహెర్ బిన్ హందాన్ అన్నారు. రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా మంగళవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా, నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో వైఎస్సార్ చిత్రపటానికి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా తాహెర్ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి జిల్లాతో ఎంతో అనుబంధం ఉందన్నారు. ఒకప్పుడు ఆయన ఒక పుట్టిన రోజును నిజాంసాగర్‌లో జరుపుకున్నారని గుర్తు చేశారు. అలీసాగర్ ఎత్తిపోతల పథకం(Alisagar Lift Irrigation Scheme) ద్వారా లక్షల ఎకరాలకు నీరు అందించిన ఘనత వైఎస్‌దేనని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో నుడా(NUDA) ఛైర్మన్ కేశ వేణు, పీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, రాష్ట్ర ఎన్ఎస్యూఐ ప్రధాన కార్యదర్శి వేణు రాజ్, జిల్లా ఎస్టీసెల్ అధ్యక్షుడు యాదగిరి, సేవాదళ్ అధ్యక్షులు సంతోష్, జిల్లా ఫిషర్మన్ కమిటీ ఛైర్మన్ శ్రీనివాస్, వినయ్, లవంగ ప్రమోద్, స్వామి గౌడ్, ముశ్షు పటేల్, సంగెం సాయిలు తదితరులు పాల్గొన్నారు.
YS Rajasekhar Reddy | జుక్కల్ క్యాంప్ కార్యాలయంలో..


వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు
అక్షరటుడే, బిచ్కుంద: దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం వైఎస్సార్ చిత్రపటానికి నివాళులు అర్పించి ఆయన ఉమ్మడి రాష్ట్రానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
YS Rajasekhar Reddy | ప్రజలతో మమేకమై..
నియోజకవర్గంలో పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు(MLA Lakshmi Kantha Rao) క్యాంప్ ఆఫీస్‌లో మంగళవారం ప్రజలను నుంచి అర్జీలను తీసుకున్నారు. వారి సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కారం నిమిత్తం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సాధ్యమైనంత త్వరగా సమస్యలు పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో మద్నూర్ ఏఎంసీ(Madnoor AMC) వైస్ ఛైర్మన్ పరమేష్ పటేల్, కల్లాలి రమేశ్ దేశాయ్ తదితరులు పాల్గొన్నారు.

స్థానికుల సమస్యలు వింటున్న ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు