ePaper
More
    HomeFeaturesYouTube | యూట్యూబ్​ కొత్త పాలసీ.. ఇక ఆ ఛానెళ్లకు గడ్డుకాలమే..!

    YouTube | యూట్యూబ్​ కొత్త పాలసీ.. ఇక ఆ ఛానెళ్లకు గడ్డుకాలమే..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : YouTube | ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్​ ఫోన్ (Smart Phone)​ ఉంది. యూట్యూబ్ (YouTube)​ అంటే తెలియని వారు లేరు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ యూట్యూబ్​ చూస్తూ గంటల కొద్ది గడిపేస్తున్నారు. పసిపిల్లల నుంచి మొదలు పెడితే పండు ముసలి వరకు యూట్యూబ్​ చూస్తున్నారు. ముఖ్యంగా చాలా మంది పిల్లలు యూట్యూబ్​ వీడియోలు పెడితేనే అన్నం తినే పరిస్థితి ఉంది.

    దీంతో యూట్యూబ్​ను చాలా మంది ఆదాయ వనరుగా (Income Source) మార్చుకున్నారు. జనాలకు ఆసక్తి కలిగించే వీడియోలు తీస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. అయితే కొందరు కాపీ కంటెంట్​తో వీడియోలు తీస్తున్నారు. వీరికి కూడా యూట్యూబ్​ ద్వారా ఆదాయం వస్తోంది. అయితే ఇలాంటి వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని యూట్యూబ్​ నిర్ణయించింది. ఈ మేరకు కొత్త మానిటైజేషన్​(Monetization) పాలసీని జులై 15 నుంచి అమలులోకి తీసుకు రానుంది.

    READ ALSO  Odisha | రీల్స్ పిచ్చి పీక్స్​.. రైల్వే ట్రాక్​పై పడుకున్న బాలుడు.. వీడియో వైరల్

    YouTube | వారి ఆటలు సాగవు

    చాలా మంది కష్టపడి యూట్యూబ్​ వీడియోలు తీస్తుంటారు. అయితే కొందరు ఎలాంటి కష్టం లేకుండా ఇతరుల కంటెంటెను కాపీ చేసి వీడియోలు రూపొందిస్తారు. థంబ్​నెయిల్స్​, వాయిస్​ ఓవర్​ మార్చి వీడియోలు అప్​లోడ్​ చేస్తారు. కొందరైతే ఒకే వీడియోను రెండు మూడు ఛానెళ్లలో అప్​లోడ్​ చేస్తారు. కొంచెం మార్పులు చేసి వేర్వేరు ఛానెళ్లలో వీడియోలు పెట్టి డబ్బులు సంపాదిస్తున్నారు. ఇప్పటికే యూట్యూబ్ కఠినంగా నిబంధనలు అమలు చేస్తున్నా కాపీరాయుళ్లు మాత్రం ఆగడం లేదు. ఈ క్రమంలో తాజాగా కొత్త మానిటైజేషన్​ పాలసీ తీసుకు వస్తున్నట్లు యూట్యూబ్​ ప్రకటించింది. జులై 15 నుంచి యూట్యూబ్ పాలసీ పూర్తిగా మారిపోనుంది. కాపీ వీడియోలతో నెట్టుకొచ్చే వారికి ఆదాయం ఆగిపోనుంది.

    YouTube | వ్యూస్​ వచ్చినా…

    సొంత కంటెంట్​తో వీడియోలు చేస్తున్న వారికి మాత్రమే ఆదాయం వచ్చేలా జులై 15 నుంచి కొత్త పాలసీ అమలు చేస్తామని యూట్యూబ్​ తెలిపింది. యూట్యూబ్ పార్ట్​నర్ ప్రోగ్రాంలో (YPP) భాగంగా దీనిని అమలు చేస్తున్నట్లు వివరించింది. కాపీ కంటెంట్​తో వీడియోలు చేసి లక్షల వ్యూస్​ వచ్చినా ఇక నుంచి రూపాయి కూడా ఆదాయం రాకుండా చర్యలు చేపడతామని యూట్యూబ్​ పేర్కొంది. సొంత టాలెంట్​తో వీడియోలు తీస్తున్న వారిని ప్రోత్సహించి.. కాపీ రాయుళ్ల ఆటలకు యూట్యూబ్​ చెక్​ పెట్టాలని నిర్ణయించింది. మానిటైజేషన్ కోసం వెయ్యి మంది సబ్ స్రైబర్లతో ఉండాలని పేర్కొంది. అంతేగాకుండా 12 నెలల వ్యవధిలో సదరు ఛానెల్​ కంటెంట్ 4 వేల గంటలు (Watch Hours) పూర్తి చేసి ఉండాలి. లేదంటే 90 రోజుల్లో పది మిలియన్ల షార్స్ట్ వ్యూలు సాధించాలని పేర్కొంది.

    READ ALSO  Samsung | సామ్ సంగ్ నుంచి మరో ప్రీమియం ఫోన్.. త్వరలోనే మార్కెట్​లోకి రానున్న గెలాక్సీ S26 అల్ట్రా

    Latest articles

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....

    Hydraa Commissioner | నాలాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hydraa Commissioner | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో నాలాలను హైడ్రా...

    Nizamabad CP | విద్యాసంస్థలపై దాడి చేస్తే కఠిన చర్యలు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad CP | విద్యా సంస్థలపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని...

    More like this

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....

    Hydraa Commissioner | నాలాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hydraa Commissioner | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో నాలాలను హైడ్రా...