అక్షరటుడే, వెబ్‌డెస్క్: YouTube Channels | యూట్యూబ్ కీలక నిర్ణయం తీసుకుంది. పలు దేశాలకు సంబంధించి 11 వేల ఛానెళ్లను తొలగించింది. వీటిలో చైనా(China)కు చెందిన ఛానెళ్లు 7,700 ఉన్నట్లు సంస్థ తెలిపింది.
ఫేక్ న్యూస్ (Fake News) ప్రచారం చేయడంతో పాటు ఇతర దేశాలపై తప్పుడు కథనాలు ప్రసారం చేయడంతో చర్యలు చేపట్టినట్లు యూట్యూబ్ (You Tube) తెలిపింది. రష్యాకు చెందిన రెండు వేల ఛానెళ్లపై సైతం చర్యలు చేపట్టింది. ఈ దేశాలు రష్యాకు మద్దతు ఇస్తూ ఉక్రెయిన్, నాటో దేశాలను వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేస్తున్నాయని గూగుల్ తెలిపింది. రష్యాలోని కొని సంస్థలకు ఈ యూట్యూబ్ ఛానెళ్లతో(YouTube Channels) సంబంధాలు ఉన్నట్లు గుర్తించామని పేర్కొంది.
చైనా, రష్యాతో పాటు తుర్కియే, ఇజ్రాయెల్, ఇరాన్, రొమేనియా, ఘనా, అజర్‌బైజాన్ దేశాలకు చెందిన యూట్యూబ్ ఛానళ్లను కూడా గూగుల్ (Google) తొలగించింది. ఆయా ఛానెళ్లలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా తప్పుడు వార్తలు పోస్ట్ చేయడంతో ఈ చర్యలు చేపట్టామని సంస్థ తెలిపింది.