More
    Homeజిల్లాలుకామారెడ్డిKamareddy Collector | యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

    Kamareddy Collector | యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Collector | యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్(Collector Ashish Sangwan), ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) యువతకు సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలో మాదక ద్రవ్యాల నివారణపై సీఎస్ఐ చర్చ్ గ్రౌండ్ (CSI Church Ground) నుంచి కళాభారతి ఆడిటోరియం (Kalabharti Auditorium) వరకు సుమారు 2 వేల మంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని కలెక్టర్, ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. కళాభారతి ఆడిటోరియం వద్ద కలెక్టర్, ఎస్పీ మొక్కలు నాటారు.

    Kamareddy Collector | చదువుపై దృష్టి పెట్టాలి..

    ఈ సందర్భంగా కలెక్టర్​, ఎస్పీ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుపై దృష్టి పెడితే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చన్నారు. స్నేహితుల ప్రోద్బలంతోనో.. తెలిసీతెలియని స్థితిలో మత్తుపదార్థాలకు బానిసలు కావద్దన్నారు. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మాదక ద్రవ్యాల జోలికి వెళ్లవద్దని సూచించారు. ఇంట్లో ఒకరు డ్రగ్స్​కు బానిసైతే ఇళ్లంతా నాశనమవుతుందని.. తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు.

    READ ALSO  Kamareddy Congress | దేవుళ్ల పేరుతో ఎమ్మెల్యే రాజకీయాలు

    Kamareddy Collector | ప్రభుత్వం ప్రత్యేక దృష్టి..

    తెలంగాణ ప్రభుత్వం సైతం డ్రగ్స్ నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టిందని కలెక్టర్​, ఎస్పీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మత్తు పదార్థాలతో కలిగే దుష్పరిణామాలను వివరిస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, ఎక్సైజ్ సూపరిండెంట్ హన్మంత్ రావు, కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి, ఇతర శాఖ అధికారులు పాల్గొన్నారు.

    ర్యాలీలో పాల్గొన్న కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య, వివిధ శాఖల ఉద్యోగులు

    Latest articles

    Operation Muskaan | పోలీసుల కీలక నిర్ణయం.. నెల రోజుల పాటు ఆపరేషన్​ ముస్కాన్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Operation Muskaan | తెలంగాణ పోలీసులు (Telangana Police) కీలక నిర్ణయం తీసుకున్నారు. తప్పిపోయిన, బాలకార్మిక,...

    Sub collector Kiranmai | ప్రజావాణిలో స్పందించట్లేదని.. సబ్​కలెక్టర్​కు ఫిర్యాదు

    అక్షరటుడే, నిజాంసాగర్‌: Sub collector Kiranmai | తహశీల్దార్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు ఇచ్చినా స్పందించకపోవడంతో ఓ...

    Hyderabad | కలుషిత నీరు సరఫరా.. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | ఎన్నో ఆశలతో హైదరాబాద్​ (Hyderabad) నగరంలో చదువుకోవడానికి వచ్చిన విద్యార్థుల ప్రాణాలతో...

    Collector Nizamabad | ప్రతి విద్యార్థి కళాశాలలో చేరేలా చూడాలి

    అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | పదో తరగతి ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరేలా...

    More like this