అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad | నిజామాబాద్ నగరంలోని ఆరో టౌన్ పోలీస్ స్టేషన్లో ఓ యువకుడు బుధవారం ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు సమాచారం. అర్సపల్లి (Arsapalli)కి చెందిన ఓ యువకుడుని గంజాయి కేసులు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఠాణాకు తరలించారు.
దీంతో మనస్తాపానికి గురైన సదరు యువకుడు పోలీస్ స్టేషన్లో (Police Station) ఫినాయిల్ తాగి ఆత్మహత్య యత్నం చేసినట్లు తెలిసింది. గమనించిన పోలీసులు స్థానికంగా ఉన్న ఆస్పత్రిలో నిందితుడికి చికిత్స చేయించినట్లు సమాచారం. అనంతరం యువకుడిని రిమాండ్కు తరలించారు. నిందితుడి వద్ద నుంచి 15 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.