అక్షరటుడే, వెబ్డెస్క్ : Traffic challan | ట్రాఫిక్ నిబంధనలు traffic rules పాటించని వాహనదారులకు పోలీసులు ఫైన్లు వేస్తారు. ఫైన్లు కట్టకపోతే వాహనాలు సీజ్ చేశారు. మరీ పోలీసులే ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే ఎలా.. ఆదర్శంగా నిలవాల్సిన పోలీసులే తమ వాహనాలకు సంబంధించిన పెండింగ్ చలాన్లు కట్టకపోతే ప్రజలు ఏమనుకుంటారు.
తెలంగాణ డీజీపీ DGP పేరిట నమోదైన పోలీసుల వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లు తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం. మొత్తం రూ.68,67,885 చలాన్లు కట్టాల్సి ఉంది. ఈ వివరాలు ఆర్టీఐ rti ద్వారా అడిగిన ప్రశ్నకు పోలీస్ శాఖ అధికారులే తెలిపారు. మొత్తం వాహనాలపై 17,391 చలాన్లకు సంబంధించి రూ.68.67 లక్షల ఫైన్లు ఉన్నాయి. సామాన్యులపై ఒక ఫైన్ ఉన్నా వాహనాలు సీజ్ చేసే అధికారులు తమ వెహికిల్స్ చలాన్లు ఎందుకు కట్టడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.