అక్షరటుడే, హైదరాబాద్: MLC Kavitha : “నా బుజ్జి ఆదిత్యా.. నీ చిట్టి చేతిని పట్టుకోవడం నుంచి నువ్వు డిగ్రీ పట్టా అందుకోవడం వరకు చూశాను. ఎంతో గొప్ప ప్రయాణం అది. నువ్వు చాలా కష్టపడ్డావురా. ఎంతగానో ఎదిగావు. నిన్ను చూసి మేమందరం గర్వపడేలా చేశావురా” అంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kalvakuntla Kavitha) ‘ఎక్స్’ వేదిక(platform of ‘X’)గా పుత్రోత్సాహాన్ని చాటారు.
ఒక తల్లిగా ఎంతగానో గర్వపడుతున్నానని కవిత సంతోషం వ్యక్తం చేశారు. ఆమె పెద్ద కొడుకు ఆదిత్య అమెరికా(America)లోని ఓక్ ఫారెస్ట్ యూనివర్సిటీ(Oak Forest University) నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా(graduation degree) అందుకున్నాడు. ఈ గ్రాడ్యుయేషన్ వేడుకకు ఎమ్మెల్సీ కవిత, అనిల్ కుమార్ దంపతులు హాజరయ్యారు.
గ్రాడ్యుయేషన్ వేడుకకు సంబంధించిన ఫొటోను ఎక్స్ లో షేర్ చేస్తూ.. కవిత తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి ఢిల్లీ(Delhi)లోని సీబీఐ ప్రత్యేక కోర్టు(CBI Special Court) ఆమెకు అనుమతి ఇచ్చింది. గ్రాడ్యుయేషన్ వేడుక పూర్తయిన నేపథ్యంలో ఈ నెల 23న ఆమె హైదరాబాద్(Hyderabad) కు తిరిగి రానున్నారు.