అక్షరటుడే, వెబ్‌డెస్క్: Arjun Tendulkar | భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ sachin tendulkar తనయుడు అర్జున్ టెండూల్కర్ arjun tendulkarపై మాజీ క్రికెటర్ యోగ్ రాజ్ సింగ్ yograj singh మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అర్జున్ టెండూల్కర్.. తన కొడుకు యువరాజ్ సింగ్ yuvaraj singh పర్యవేక్షణలో ట్రైనింగ్ తీసుకుంటే.. అంతర్జాతీయ క్రికెట్‌లో మరో క్రిస్ గేల్ chris gayle గా ఎదుగుతాడని చెప్పాడు. తాజాగా ఓ క్రికెట్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగ్‌రాజ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
‘నేను గతంలో చెప్పినట్లుగా అర్జున్ టెండూల్కర్.. బౌలింగ్ bowlingపై ఫోకస్ తగ్గించి బ్యాటింగ్ battingపై ఎక్కువ శ్రద్ద పెట్టాలి. సచిన్ తనయుడికి యువరాజ్ సింగ్ మూడు నెలల పాటు శిక్షణ ఇస్తే.. అర్జున్ మరో క్రిస్ గేల్ అవుతాడు. ఈ విషయంలో నేను పందెం వేసుందుకు రెడీ. ఓ ఫాస్ట్ బౌలర్ గాయపడితే బౌలింగ్‌లో అంతగా ప్రభావం చూపలేడు. సచిన్ టెండూల్కర్ తన కొడుకుని యువరాజ్ సింగ్‌కు అప్పగించాలి.
అభిషేక్ శర్మ Abhishek Sharmaలో ఓ విధ్వంసకర బ్యాటర్ ఉన్నాడని గుర్తించిందే యువరాజ్ సింగ్. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ అధికారులు అతన్ని ఓ బౌలర్‌గా మాత్రమే చూశారు. కానీ అతనిలోని బ్యాటింగ్ batting సామర్థ్యాన్ని గుర్తించి ప్రోత్సహించింది యువరాజ్ సింగ్.’అని యోగ్ రాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు. గతంలో యోగ్‌రాజ్ పర్యవేక్షణలో అర్జున్ టెండూల్కర్ కొన్ని రోజుల పాటు శిక్షణ తీసుకున్నాడు. ఆ తర్వాత అతను గోవా Goa తరఫున రంజీ ట్రోఫీలో అదరగొట్టాడు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ యోగ్ రాజ్ సింగ్.. అర్జున్ టెండూల్కర్‌కు పలు సూచనలు చేశాడు. అతనిలో మంచి బ్యాటర్ ఉన్నాడని, బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టాలని సూచించాడు.
ఐపీఎల్ IPL 2025 సీజన్‌లో అర్జున్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్‌కు ప్రాతనిథ్యం వహిస్తున్నారు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో రూ. 30 లక్షల కనీస ధరకు అతన్ని ముంబై కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు అర్జున్ టెండూల్కర్‌కు తుది జట్టులో అవకాశం దక్కలేదు.