అక్షరటుడే, వెబ్‌డెస్క్: Yashaswi Jaiswal | బర్మింగ్‌హామ్ ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో (England) జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా (Team india) మూడు వికెట్లు కోల్పోయి కష్టాలలో పడింది. టీమిండియా 15 పరుగుల స్కోరు వద్ద తొలి వికెట్ రూపంలో కేఎల్ రాహుల్ (KL Rahul) అవుట్ అయ్యాడు. తొలి టెస్టులో అదరగొట్టిన కేఎల్ రాహుల్ కేవలం రెండో టెస్ట్‌లో కేవలం రెండు పరుగులకే పెవిలియన్ చేరాడు. ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్‌లో వోక్స్ (Woaks) వేసిన బంతిని డిఫెండ్ చేసే ప్రయత్నంలో రాహుల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఎన్నో సంవత్సరాల తర్వాత భారత టెస్ట్ జట్టులోకి (India test team) తిరిగి వచ్చిన కరుణ్ నాయర్ (Karun nayar) తన పునరాగమనాన్ని విజయవంతంగా మలుచుకోలేకపోతున్నాడు. 2017 తర్వాత తొలిసారిగా టెస్టుల్లో అవకాశాన్ని అందుకున్న ఆయన 2025లో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్టుల అండర్సన్-సచిన్ ట్రోఫీలో (Anderson-sachin trophy) టీమ్‌లో చోటు సంపాదించాడు.
Yashaswi jaiswal | మరోసారి నిరాశే..
అయితే తొలి టెస్ట్‌లో 0, 20 పరుగులకే పరిమితమవడం ద్వారా తీవ్రంగా నిరాశపరిచాడు. ఇప్పుడు ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో (Second test) కూడా కరుణ్ నాయర్ (Karun Nayar) తన పేలవ ఫామ్‌ను కొనసాగించాడు. ఫస్ట్ డౌన్‌లో క్రీజులోకి వచ్చిన ఆయన 50 బంతుల్లో 31 పరుగులు చేసి బ్రైడన్ కార్స్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ అయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు మాత్రమే వచ్చాయి. జైస్వాల్‌తో (Jaiswal) కలిసి రెండో వికెట్‌కు 80 పరుగుల భాగస్వామ్యం నమోదైనప్పటికీ, కరుణ్ స్తాయికి తగ్గ ఆట తాను ఆడలేకపోయాడు. 2016లో చెన్నై టెస్ట్‌లో 303* పరుగులు చేసి ట్రిపుల్ సెంచరీ (triple century) సాధించిన రెండో భారత బ్యాటర్‌గా గుర్తింపు పొందిన కరుణ్, ఆ తర్వాత స్థిరంగా రాణించలేక జట్టులో స్థానం కోల్పోయాడు. అయినా దేశవాళీ క్రికెట్‌లో రెండు సీజన్లు సత్తాచాటడంతో తిరిగి సెలక్షన్ సాధించాడు.
కరుణ్ నాయర్ కోసం యువ బ్యాటర్ సాయి సుదర్శన్‌ను పక్కకు పెట్టిన సెలెక్టర్లు, అతని వైఫల్యంతో మరో అవకాశం ఇవ్వకపోవచ్చు. ఇక మంచి ఫామ్‌లో ఉన్న యశస్వి జైస్వాల్( 87) (Yashasvi Jaiswal) పరుగులు చేసి ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో శుభ్‌మన్ గిల్ (Shubham Gill)( 50 నాటౌట్, 5 ఫోర్లు), రిషబ్ పంత్ ( 16, 1 సిక్స్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 3 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. తొలి రోజు భారత్ 30 ఓవర్లకి పైగా ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, సాయి సుదర్శన్ స్థానంలో నితిశ్‌కుమార్‌రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్‌లకు టీమ్ మేనేజ్‌మెంట్ చోటు కల్పించింది.