అక్షరటుడే, వెబ్‌డెస్క్: Yamini Sharma | బీజేపీ అధికార ప్రతినిధి సాదినేని యామినిశర్శ (Sadineni Yamini Sharma) జాతీయ కౌన్సిల్ సభ్యురాలిగా నియమితులయ్యారు. బీజేపీ తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ కమల దళాధిపతిగా రాంచందర్‌రావు(Ramchandra Rao), ఏపీకి అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్(AP President PVN Madhav) ఎన్నికయ్యారు. ఈ క్రమంలో జాతీయ కౌన్సిల్ సభ్యులను కూడా బీజేపీ ప్రకటించింది. ఇందులో సాదినేని యామిని శర్మకు సైతం చోటు దక్కింది.
యామిని శర్మ మాట్లాడుతూ.. మాధవ్‌ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం పార్టీ కార్యకర్తలకు ఎంతో ఆనందాన్ని, ఉత్సాహాన్ని కలిగించిందన్నారు. పార్టీ తన సేవలను గుర్తించి, జాతీయ మండలి సభ్యురాలిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు. కాగా ఆమెతో పాటు ఎంపీలు డి.పురందేశ్వరి, సీఎం రమేష్, ఎమ్మెల్యేలు పి.విష్ణు కుమార్ రాజు, పార్థసారథి, 20-పాయింట్ ప్రోగ్రామ్ ఛైర్మన్ లంకా దినకర్, జీవీఏ నరసింహారావు, విష్ణు వర్ధన్ రెడ్డి తదితరులు జాతీయ మండలి సభ్యులుగా నియమితులయ్యారు.
Yamini Sharma | టీడీపీ నుంచి..
యామినిశర్శ టీడీపీ నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. మంచి వాగ్దాటి కలిగిన ఆమె అంచెంలంచలుగా రాజకీయాల్లో ఎదిగారు. 2023లో టీడీపీకి రాజీనామా చేసిన ఆమె 2024లో కాషాయ గూటికి చేరారు. అనంతరం పార్టీ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్న ఆమెను కేంద్ర నాయకత్వం తాజాగా జాతీయ కౌన్సిల్ మెంబర్(National Council Member)గా నియమించింది.