అక్షరటుడే, వెబ్‌డెస్క్:ENG vs IND | లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్ట్‌లో ఇండియా జట్టు 22 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైంది. 193 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియా(Team India) రెండో ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో బెన్ స్టోక్స్ సారథ్యంలోని ఇంగ్లండ్ జట్టు(England Team) ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. చిన్న లక్ష్యమే అయినప్పటికీ భారత బ్యాట్స్‌మెన్స్ ఎవరూ కూడా క్రీజులో కుదురుకోకపోవడంతో ఓటమి తప్పలేదు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్ డకౌట్ కావడం, అనంతరం కేఎల్ రాహుల్ (39), కరుణ్ నాయర్ (14), శుభ్‌మాన్ గిల్ (6) వెంటవెంటనే వికెట్స్ కోల్పోయారు.
ENG vs IND | పడిపోయిన ర్యాంక్..
ఇన్నింగ్స్ చివర్లో రవీంద్ర జడేజా(Ravindra Jadeja) అద్భుతంగా పోరాడాడు. 181 బాల్స్‌లో 61 పరుగుల నాటౌట్ ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌పై కొంత ఆశలు కల్పించాడు. బుమ్రా (35)తో కలిసి తొమ్మిదో వికెట్‌కు 132 బంతుల్లో విలువైన భాగస్వామ్యం నిర్మించాడు. చివరకు సిరాజ్ వికెట్ కోల్పోవడంతో భారత్ 170 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కాగా.. బెన్ స్టోక్స్ 3 వికెట్లు, జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు, బ్రైడాన్ కార్స్ 2 వికెట్లు, క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్ ఒక్కో వికెట్ తీశారు. అయితే ఇంగ్లండ్ స్పిన్నర్ సోషబ్ బషీర్ 5వ బంతిని ఆఫ్ బ్రేక్ వేయగా.. సిరాజ్ బాగానే డిఫెండ్ చేశాడు. కానీ బంతి నేలపై పడి స్టంప్స్‌ని వెళ్లి తాకింది. అనుకోనివిధంగా అవుట్ కావడంతో సిరాజ్ భావోద్వేగానికి గురికావాల్సి వచ్చింది.
అయితే లార్డ్స్ టెస్ట్(Lords Test) ఓటమితో టీమిండియా (WTC) పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పడిపోయింది. ఇంగ్లండ్ మూడో స్థానానికి ఎగబాకింది. ఆస్ట్రేలియా రెండు మ్యాచ్‌లు ఆడగా, రెండు విజయాలు సాధించి 24 పాయింట్స్‌తో టాప్‌లో నిలిచింది. ఇక శ్రీలంక మూడు మ్యాచ్‌లు ఆడగా అందులో రెండు గెలిచి 16 పాయింట్స్ సాధించి టాప్ 2లో నిలిచింది. ఇక మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో ఇంగ్లండ్ జట్టు ఖాతాలో 24 పాయింట్లు వచ్చి చేరాయి. ఈ క్రమంలో మూడో స్థానం దక్కించుకుంది. భారత్ మూడు మ్యాచుల్లో ఒక విజయం మాత్రమే సాధించడంతో టీమిండియా ఖాతాలో 12 పాయింట్లు రావడం జరిగింది. దీంతో భారత్ నాలుగో స్థానానికి పడిపోయింది. టాప్ ఆర్డర్ సరైన ప్రదర్శన కనబరచకపోవడం ఈ ఓటమికి ప్రధాన కారణం.