అక్షరటుడే, వెబ్డెస్క్ : KCR | మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని కేసీఆర్ Kcr అన్నారు. వరంగల్ సభలో warangal Brs Sabha ఆయన మాట్లాడుతూ.. పోలీసులను హెచ్చరించారు. కాంగ్రెస్ చెప్పినట్లు తమ కార్యకర్తలపై కేసులు పెట్టడం, ప్రస్తుతం సభను అడ్డుకోవడానికి పోలీసులు యత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇలా చేస్తున్న పోలీసులు telangana police తమ డైరీలో రాసుకోవాలని.. వచ్చేది తమ ప్రభుత్వమేనని, అప్పుడు వారి లెక్క తేలుస్తామన్నారు.
కాంగ్రెస్ నాయకులు నిత్యం బీఆర్ఎస్ మీద నిందలు వేయడం తప్ప చేసిందేమి లేదన్నారు. నాడు వైఎస్ హయాంలో ఆరోగ్య శ్రీ పథకం arogya shree scheme తెస్తే అది బాగుండటంతో దానిని తమ ప్రభుత్వ హయాంలో అలాగే కొనసాగించామన్నారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని చూస్తోందన్నారు. ప్రస్తుతం రజతోత్సవ సభ పెట్టుకుంటే అనేక అడ్డంకులు సృష్టించారని పేర్కొన్నారు.
KCR | కమీషన్ల ప్రభుత్వం..
ప్రస్తుతం రాష్ట్రంలో కమీషన్ల ప్రభుత్వం నడుస్తోందని కేసీఆర్ ఆరోపించారు. 20 శాతం కమీషన్లు ఇస్తే కానీ బిల్లులు ఇవ్వడం లేదన్నారు. కమీషన్లు తీసుకుంటున్నారని కాంట్రాక్టర్లు సచివాలయంలో ఆర్థిక శాఖ మంత్రి ఛాంబర్ ఎదుట ధర్నా చేశారని గుర్తు చేశారు. ప్రజల వెంట బీఆర్ఎస్ ఉంటుందన్నారు.
KCR | ఆపరేషన్ కగార్ ఆపేయండి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేసింది శూన్యమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను ఎన్కౌంటర్ చేస్తోందన్నారు. ఎంతో మంది అమాయక గిరిజనులను చంపేస్తోందన్నారు. నక్సలైట్లు చర్చలకు సిద్ధమని ప్రకటించారని, వారితో మాట్లాడి సమస్య పరిష్కరించాలన్నారు. వెంటనే ఎన్కౌంటర్లు ఆపాలని కోరారు. ఈ మేరకు కేంద్రానికి బీఆర్ఎస్ తరఫున లేఖ రాస్తామన్నారు.
KCR | ప్రభుత్వాన్ని పడగొట్టం
తాము ప్రభుత్వాన్ని పడగొట్టమని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ప్రజలకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని, వాటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయకపోతే ప్రజలే కాంగ్రెస్ వీపు పగులకొడతారన్నారు. తమకు ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అవసరం లేదన్నారు.