అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: CP Sai Chaitanya | మహిళా కానిస్టేబుళ్లు (Women constables) ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లుగా అన్ని విధాలుగా శిక్షణ పొందాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో (Police Parade Ground) మహిళా కానిస్టేబుళ్లకు వివిధ అంశాల్లో శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతిభద్రతలకు (law and order) విఘాతం కలిగించే ఘటనలు జరిగినప్పుడు మహిళా కానిస్టేబుళ్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. తమను తాము రక్షించుకుంటూ ప్రజలను రక్షించే ఘటనల్లో చురుకుగా పాల్గొనేందుకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. వివిధ క్రీడాంశాల్లో శిక్షణ పొందడం ద్వారా మహిళా కానిస్టేబుళ్లలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని పేర్కొన్నారు.
మహిళలు నిరసన కార్యక్రమాలు నిర్వహించే సమయంలో మహిళా పోలీసు సిబ్బంది ఎలా విధులు నిర్వహించాలి.. అత్యవసర పరిస్థితుల్లో ఎలా ప్రవర్తించాలని అనే విషయాల్లో శిక్షణ తప్పనిసరి అని వివరించారు. వారంరోజుల పాటు నిర్వహించే శిక్షణను ప్రతి మహిళా సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు డీసీపీ (ఏఆర్) రామ చంద్రరావు (Additional DCP (AR) Rama Chandra Rao), ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి (ACP Raja Venkat Reddy), రిజర్వ్ ఇన్స్పెక్టర్లు సతీష్, శేఖర్ బాబు, ప్రభుత్వ స్కూళ్ల టీచర్లు సంతోషి, అనిత, రజని తదితరులు పాల్గొన్నారు.