అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | వ్యవసాయ పనుల కోసం వెళ్లిన ఓ మహిళ అక్కడే చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య(Suicide) చేసుకున్న ఘటన కామారెడ్డి మున్సిపాలిటీ(Kamareddy Municipality) పరిధిలోని సరంపల్లి శివారులో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్థులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కామారెడ్డి మండలం నర్సన్నపల్లికి చెందిన చిదుర కవిత(40) బుధవారం సాయంత్రం వ్యవసాయ పనుల నిమిత్తం సరంపల్లి శివారులోని పొలం వద్దకు వెళ్లింది. రాత్రయినా ఇంటికి తిరిగి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు(Family Members) వెళ్లి చూడగా చెట్టుకు చీరతో ఉరేసుకుని కనిపించింది.
పోలీసులకు(Police) సమాచారం ఇవ్వగా వారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె ఒంటిపై పుస్తెలతాడు, ఇతర బంగారు ఆభరణాలు లేకపోవడంతో ఎవరైనా హత్యాచారం చేశారా అనే అనుమానం గ్రామస్థులు వ్యక్తం చేశారు.