అక్షరటుడే, బోధన్: RTC bus | ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు కిందపడి మహిళ మృతి చెందిన ఘటన ఎడపల్లి మండలం కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళ్‌పాడ్ గ్రామానికి చెందిన చాకలి నాగమణి పని నిమిత్తం నిజామాబాద్ వచ్చింది. మంగళవారం బోధన్ బస్ ఎక్కి మంగళపాడ్ వద్ద దిగింది. అయితే నాగమణి బస్సు దిగి వెళ్తున్నట్లుగా డ్రైవర్ గమనించకుండా బస్సును ముందుకు తోలడంతో బస్సు ముందు చక్రాల కింద పడింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బస్సును పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
