ePaper
More
    HomeసినిమాRamayana Movie Budget | రూ.4 వేల కోట్లతో 'రామాయణ' చిత్రీకరణ.. దేశంలోనే తొలి భారీ...

    Ramayana Movie Budget | రూ.4 వేల కోట్లతో ‘రామాయణ’ చిత్రీకరణ.. దేశంలోనే తొలి భారీ బ‌డ్జెట్ చిత్రం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Ramayana Movie Budget | దేశంలోనే అత్యంత భారీ చిత్రం ప‌ట్టాలెక్కుతోంది. రూ.4 వేల‌ కోట్ల‌ బ‌డ్జెట్‌తో ‘రామాయణ’ (Ramayana) తెర‌కెక్కుతోంది. రెండు భాగాలుగా నిర్మిస్తున్న ఈ సినిమా దేశంలోనే భారీ బ‌డ్జెట్ సినిమాగా చరిత్ర సృష్టించ‌నుంది.

    ఈ చిత్ర నిర్మాణానికి మొద‌ట్లో రూ.1600 కోట్ల బ‌డ్జెట్ వెచ్చిస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. కానీ, అంత‌కు రెండు రెట్ల మేర అధికంగా ఖ‌ర్చు చేస్తున్న‌ట్లు తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఆస‌క్తి రేపుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్‌(First Look Teaser)ను మేకర్స్ గత వారం విడుదల చేశారు. అప్పటి నుంచి ఈ చిత్రంపై అంచనాలు పెరిగి పోయాయి.

    2026 దీపావళికి రామాయణ పార్ట్-1 విడుదల కానుంది. రెండో భాగం 2027లో దీపావళికి విడుద‌ల చేసేలా చిత్ర బృందం స‌న్నాహాలు చేప‌ట్టింది. రామాయణ రెండు భాగాలు రూ. 1600 కోట్ల బడ్జెట్‌తో నిర్మించబడుతున్నాయని గతంలో వార్తలు వచ్చాయి. కానీ నిర్మాత నమిత్ మల్హోత్రా (Producer Namit Malhotra) తాజాగా చేసిన బ‌డ్జెట్ ప్ర‌క‌ట‌న‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు. సుమారు రూ.4 వేల కోట్ల ఖ‌ర్చ‌వుతుంద‌ని వెల్ల‌డించారు.

    READ ALSO  Costly Hand Bag | ఏంటీ.. ఆ న‌టి హ్యాండ్ బ్యాగ్ ధ‌ర ఏకంగా రూ. 84 కోట్లా..! ద‌క్కించుకున్న‌ ప్రైవేట్ కలెక్టర్

    Ramayana Movie Budget | భారీ బడ్జెట్‌తో..

    నిర్మాత నమిత్ మల్హోత్రా ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో రామాయ‌ణం చిత్రానికి సంబంధించి కీల‌క విష‌యాలు వెల్ల‌డించారు. ప్ర‌ధానంగా సినిమా బడ్జెట్ గురించి వెల్లడి చేశారు. ‘దీనికి (సినిమాకు) మేమే నిధులు సమకూరుస్తున్నాము. ఎవరి నుంచి డబ్బు తీసుకోలేదు. 6-7 సంవత్సరాల క్రితం నుంచే సినిమా చిత్రీక‌ర‌ణ‌పై చాలా సీరియ‌స్‌గా ఉన్నాం. ‘రామాయణ’ రెండు భాగాల బడ్జెట్ 500 మిలియన్ డాలర్లు. అంటే, ఇది భారతీయ రూపాయలలో 4000 కోట్లు (4000 Crores in Rupees). ఏ భారతీయ సినిమా కూడా దీనికి దగ్గరగా లేదు. ఇది అద్భుతమైన స్కేల్,’ అని మల్హోత్రా వెల్ల‌డించారు.

    Ramayana Movie Budget | హ‌లీవుడ్ కంటే త‌క్కువే..

    ‘రామాయ‌ణ’ కంటే మించిన అతి పెద్ద క‌థ ప్ర‌పంచంలోనే మ‌రొక‌టి లేద‌ని, అందుకే అంతే పెద్ద బ‌డ్జెట్ కేటాయించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు నమిత్ మల్హోత్రా వెల్ల‌డించారు. అయితే త‌మ బ‌డ్జెట్ ఇప్ప‌టికీ హాలీవుడ్ చిత్రాల కంటే త‌క్కువ‌గానే ఉంద‌ని భావిస్తున్న‌ట్లు చెప్పారు.

    READ ALSO  Tollywood Ravi Teja | ర‌వితేజ ఇంట తీవ్ర విషాదం.. సంతాపం తెలిపిన ప్ర‌ముఖులు

    ‘ప్రపంచంలోనే అతిపెద్ద కథ కోసం అతిపెద్ద సినిమాను నిర్మిస్తున్నాం. ఈ సినిమాను యావ‌త్ ప్రపంచం చూడాలి. మిగ‌తా కొన్ని హాలీవుడ్ చిత్రాల బడ్జెట్ కంటే ఇది ఇప్పటికీ త‌క్కువేన‌ని భావిస్తున్నా. తక్కువ డబ్బుతో పెద్ద సినిమాను నిర్మిస్తున్నామని అనుకుంటున్నా. నాలోని భారతీయుడు ఇప్పటికీ మనం ఆర్థికంగా బాధ్యతారహితంగా లేమని నమ్ముతాడు. డబ్బు విషయంలో బాధ్యతారహితంగా ఉండలేమని’ చెప్పారు.

    Ramayana Movie Budget | భారీ బ‌డ్జెట్ సినిమాల‌ను త‌ల‌ద‌న్నెలా..

    మ‌న దేశంలో గ‌తంలో భారీ బ‌డ్జెట్ సినిమాలు వ‌చ్చినప్ప‌టికీ, తొలిసారి రూ.4 వేల కోట్ల‌తో సినిమా రావ‌డం విశేషం. గతంలో ఎస్ఎస్ రాజమౌళి రూ. 500 కోట్ల బడ్జెట్‌తో ఆర్ఆర్ఆర్ నిర్మించారు. నాగ్ అశ్విన్ నిర్మించిన కల్కి 2898 AD సినిమాకు రూ. 600 కోట్ల మేర వెచ్చించారు. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బంప‌ర్ హిట్ అయ్యాయి.

    READ ALSO  Movie Ticket Price | సినీ ప్రియుల‌కు శుభ‌వార్త‌.. టికెట్ రేట్ల‌పై ప‌రిమితి విధించిన క‌ర్ణాట‌క‌

    ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా రూ. 1,200 కోట్లు వసూలు చేయ‌గా, కల్కి 2898 AD కూడా రూ. 1200 కోట్లు వసూలు చేసి, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు చేసిన నాలుగో భారతీయ చిత్రంగా నిలిచింది. ప్ర‌స్తుతం ఎస్ఎస్ రాజమౌళి మహేశ్‌బాబుతో నిర్మిస్తున్న సినిమాకు 1000 కోట్ల బడ్జెట్ అవుతుంద‌ని చెబుతున్నారు. అయితే, రామాయణ పార్ట్స్ 1, 2 ల బడ్జెట్ ఇప్పటికే ఎస్ఎస్ రాజమౌళి రాబోయే సినిమా నిర్మాణ వ్యయం కంటే నాలుగు రెట్లు ఎక్కువ కావ‌డం విశేషం.

    Latest articles

    Local Body Elections | స్థానిక పోరుపై కీలక అప్​డేట్​.. ఎన్నికలకు సిద్ధం కావాలని ఆదేశించిన ప్రభుత్వం

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Local Body Elections | రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు (local body elections) త్వరలో...

    TB Mukt Bharat Abhiyan | టీబీ ముక్త్ భారత్ అభియాన్​లో భాగస్వాములు కావాలి: గవర్నర్​

    అక్షరటుడే, ఇందూరు: TB Mukt Bharat Abhiyan | టీబీ ముక్త్ భారత్ అభియాన్​లో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని...

    ACB Trap | ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్​ ఇంజినీర్​ ఇన్​ చీఫ్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్‌ : ACB Trap | రాష్ట్రంలో అవినీతి అధికారులు మారడం లేదు. సామాన్య ప్రజల నుంచి...

    Jal Shakti meeting | కేంద్ర జలశక్తి సమావేశంలో కీలక నిర్ణయం.. జల వివాదాల పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Jal Shakti meeting | జల వివాదాలపై కేంద్ర జలశక్తి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు....

    More like this

    Local Body Elections | స్థానిక పోరుపై కీలక అప్​డేట్​.. ఎన్నికలకు సిద్ధం కావాలని ఆదేశించిన ప్రభుత్వం

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Local Body Elections | రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు (local body elections) త్వరలో...

    TB Mukt Bharat Abhiyan | టీబీ ముక్త్ భారత్ అభియాన్​లో భాగస్వాములు కావాలి: గవర్నర్​

    అక్షరటుడే, ఇందూరు: TB Mukt Bharat Abhiyan | టీబీ ముక్త్ భారత్ అభియాన్​లో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని...

    ACB Trap | ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్​ ఇంజినీర్​ ఇన్​ చీఫ్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్‌ : ACB Trap | రాష్ట్రంలో అవినీతి అధికారులు మారడం లేదు. సామాన్య ప్రజల నుంచి...