అక్షరటుడే, బాన్సువాడ: Jakkidi Shivacharan Reddy | స్థానిక సంస్థల ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ సభ్యులకు 25 శాతం సీట్లు కేటాయించే విధంగా కృషి చేస్తానని రాష్ట్ర యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి(Jakkidi Shivacharan Reddy) అన్నారు. పట్టణంలోని శ్రీనివాస గార్డెన్(Srinivasa Garden) లో జిల్లా స్థాయి యూత్ కాంగ్రెస్ కార్యకర్తల సమీక్షా సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు.
Jakkidi Shivacharan Reddy | ప్రభుత్వ పథకాలు ప్రతిఇంటికీ చేరాలి..
కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) ప్రవేశ పెట్టిన పథకాలను గ్రామీణ స్థాయిలో ప్రతి ఇంటికి చేరే విధంగా కృషి చేయాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం18 నెలల్లో 50 వేల ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రూపు రాజకీయాలు పక్కనపెట్టి అందరూ కలిసిమెలిసి పనిచేయాలని సూచించారు. అంతకుముందు మాజీ డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు ఏకగ్రీవం అయ్యేవిధంగా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, జిల్లా ఇన్చార్జ్ అమృత, కాసుల రోహిత్, పీసిసి డెలిగేట్ రాజిరెడ్డి, మన్సుర్, శ్రీనివాస్, సర్దార్, దుర్గం శ్యామల, అలిబిన్, సురేష్ బాబా, ఎజాజ్ తదితరులు పాల్గొన్నారు.