అక్షరటుడే, వెబ్డెస్క్: IPO | ఫ్రాగ్రెన్స్, ఫ్లేవర్ల తయారీలో గుర్తింపు పొందిన సచీరోమ్(Sacheerome) లిమిటెడ్ ఎస్‌ఎంఈ కంపెనీ స్టాక్ మార్కెట్ నుంచి నిధులు సమీకరించేందుకు ఐపీవో(IPO)కు వస్తోంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 61.62 కోట్లు సమీకరించాలన్నది లక్ష్యం. మొత్తం 60.41 లక్షల తాజా షేర్ల(Fresh shares)ను జారీ చేయడం ద్వారా ఈ మొత్తాన్ని సమీకరించనున్నారు. ఐపీవో ద్వారా సమీకరించే మొత్తాన్ని ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధానగర్‌లో కొత్త తయారీ కేంద్రం ఏర్పాటు కోసం, ఇతర సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం ఉపయోగించనున్నట్లు కంపెనీ తెలిపింది.
IPO | సబ్‌స్క్రిప్షన్ వివరాలు..
ఐపీవో సబ్‌స్క్రిప్షన్ (Subscription) సోమవారం ప్రారంభమవుతుంది. 11న ముగుస్తుంది. ఈనెల 12న రాత్రి అలాట్‌మెంట్ స్టేటస్ వెలువడే అవకాశాలున్నాయి. కంపెనీ షేర్లు ఈనెల 16న ఎన్‌ఎస్‌ఈ(NSE)లో లిస్టవుతాయి.
IPO | ప్రైస్ బాండ్..
ధరల శ్రేణి(Price band)ని రూ. 96 నుంచి రూ. 102గా నిర్ణయించారు. ఒక లాట్‌లో 1,200 షేర్లున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు ఒక లాట్ కోసం రూ. 1,22,400 తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
IPO | కోటా, జీఎంపీ..
రిటైల్(Retail) ఇన్వెస్టర్లకు 35 శాతం షేర్లను కేటాయించారు. కాగా ఈ కంపెనీ షేర్లకు గ్రే మార్కెట్ ప్రీమియం(GMP) 29 శాతంగా ఉంది.
IPO | కంపెనీ వివరాలు..
సచీరోమ్ కంపెనీ 1992 జూన్‌లో ప్రారంభమైంది. ఫ్రాగ్రెన్స్, ఫ్లేవర్ల(Fragrance and flavour) డిజైనింగ్, తయారీలో ప్రత్యేక గుర్తింపు పొందింది. పర్సనల్ కేర్, బాడీ కేర్, హెయిర్ కేర్, ఫాబ్రిక్ కేర్, హోమ్ కేర్, బేబీ కేర్, ఫైన్ ఫ్రాగ్రెన్స్, ఎయిర్ కేర్, పెట్ కేర్, మెన్స్ గ్రూమింగ్, హైజీన్, వెల్నెస్ ఇండస్ట్రీలో వీటిని ఉపయోగిస్తారు. ఈ కంపెనీ తయారు చేసే ఫ్లేవర్లను కూల్‌డ్రింక్స్, బేకరీ, కాన్ఫెక‌్షనరీ, డైరీ ప్రొడక్ట్స్, హెల్త్ అండ్ న్యూట్రిషన్, ఓరల్ కేర్ తదితర వాటిలో వినియోగిస్తారు.
IPO | కంపెనీ ఆర్థిక పరిస్థితి..
గతేడాది మార్చి 31 వరకు కంపెనీ ఆదాయం రూ. 86.40 కోట్లు ఉండగా.. ఈ ఏడాది మార్చి 31 వరకు రూ. 108.13 కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో లాభాలు రూ. 10.67 కోట్లనుంచి రూ. 15.98 కోట్లకు చేరాయి. ఆస్తులు రూ. 63.52 కోట్లనుంచి రూ. 84.67 కోట్లకు, అప్పులు రూ. 1.43 కోట్లనుంచి రూ. 3.47 కోట్లకు పెరిగాయి.