ePaper
More
    Homeక్రీడలుIndia vs England | భారత జట్టు చరిత్ర తిరగరాయనుందా.. ఉత్కంఠగా రెండో టెస్ట్

    India vs England | భారత జట్టు చరిత్ర తిరగరాయనుందా.. ఉత్కంఠగా రెండో టెస్ట్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:India vs England | ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌ ఉత్కంఠభరితంగా మారుతోంది. టెస్ట్ ప్రారంభం నుంచి భారత్ అజేయంగా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తోంది. మూడో రోజు ఇంగ్లాండ్ (England)కాస్త‌ ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ, నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి మ్యాచ్‌పై భారత్ తిరిగి పట్టు సాధించింది. భారత్(India) విధించిన 608 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ జట్టు తొలి ఓవర్స్‌లోనే తడబడింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి, ఇంగ్లాండ్ 3 వికెట్లు కోల్పోయి 72 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఇంకా 536 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 7 వికెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి.

    India vs England | గిల్ జిగేల్‌మ‌నిపిస్తాడా..

    జాక్ క్రాలీ (0) మహ్మద్ సిరాజ్(Mohammed Siraj) అద్భుతమైన బౌలింగ్‌కు బలి కాగా, బెన్ డకెట్ (25) ఆకాష్ దీప్ మెరుపు బంతితో పెవిలియన్ బాట ప‌ట్టాడు. ఇక జో రూట్ (6) ఆకాష్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. దీంతో కీల‌క వికెట్లు ప‌డ్డాయి. భారత్ బౌలింగ్‌లో ఆకాష్ దీప్ (2 వికెట్లు), సిరాజ్ (1 వికెట్) కీలకంగా రాణించారు. ఐదో రోజు భార‌త బౌల‌ర్స్ చెల‌రేగితే భార‌త జ‌ట్టు స‌రికొత్త చ‌రిత్ర సృష్టించ‌డం ఖాయం. ఇప్పటి వరకు ఎడ్జ్‌బాస్టన్ వేదికగా భారత్ ఒక్క టెస్ట్ కూడా గెలవలేదు. కానీ ఈసారి శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో అద్భుత ఆటతీరుతో ఆ చరిత్రను తిరగరాయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఐదో రోజు ఆటలో భారత బౌలర్లపై ఆధారపడి విజయం దిశగా అడుగులు వేయాలి.

    READ ALSO  Rishab Pant | రిష‌బ్ పంత్ కాలు తీయాల్సి వ‌చ్చేది.. ఆ విన్యాసాలే వ‌ద్దంటూ డాక్ట‌ర్ హెచ్చ‌రిక‌

    ఇంగ్లాండ్ ఇప్పటికే 1-0తో సిరీస్‌లో ముందంజలో ఉన్న నేపథ్యంలో, ఈ మ్యాచ్ భారత్‌కు చాలా కీలకమైంది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో అద‌ర‌గొట్టిన‌ శుభ్‌మన్ గిల్ (Subhman Gill) రెండో ఇన్నింగ్స్ లో 161 (13 ఫోర్లు, 8 సిక్సర్లు ప‌రుగులు చేశాడు. ఆయ‌న‌కి జ‌త‌గా కేఎల్ రాహుల్ (55),రిషబ్ పంత్ –65 (8 ఫోర్లు, 3 సిక్సర్లు), రవీంద్ర జడేజా – 69 (5 ఫోర్లు, 1 సిక్స్) పరుగులతో రాణించారు. ఇక‌ భారత్ తన రెండో ఇన్నింగ్స్‌ను 427/6 వద్ద డిక్లేర్ చేసింది. మొత్తంగా ఈ టెస్ట్ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ 430 పరుగులు చేయడంతో, టెస్ట్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండవ భారతీయుడిగా నిలిచాడు. అతను మొదటి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ చేసి, రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ బాదిన అరుదైన ఆటగాడిగా గుర్తింపు పొందాడు.

    READ ALSO  Akash Deep | ఆకాశ్ దీప్ జీవితంలో ఇన్ని క‌ష్టాలు ప‌డ్డాడా.. అక్క క్యాన్స‌ర్ బారిన ప‌డ‌డంతో..!

    Latest articles

    Yash Dayal | ఆర్సీబీ బౌల‌ర్‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు.. అరెస్ట్ అయితే కెరీర్ ప్ర‌మాదంలో ప‌డ్డ‌ట్టేనా..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Yash Dayal | విరాట్ కోహ్లీ ఫ్రెండ్, ఐపీఎల్ సెన్సేషన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్...

    Indigo Flight | వైర‌ల్ వీడియో.. విమానాన్ని క‌ద‌ల‌నివ్వ‌కుండా చేసిన తేనె టీగ‌ల గుంపు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Indigo Flight | సాధార‌ణంగా విమానాలు ఆలస్యమవడానికి కారణం వాతావరణ సమస్యలు, సాంకేతిక లోపాలు, ఎయిర్‌...

    City Civil Court | సిటీ సివిల్‌ కోర్టుకు బాంబు బెదిరింపు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: City Civil Court | హైదరాబాద్(Hyderabad)​ నగరంలోని పాతబస్తీలో గల సిటీ సివిల్​ కోర్టుకు బాంబు...

    Stock Market | మూడో రోజూ స్తబ్దుగానే.. స్టాక్‌ మార్కెట్‌లో అదే ఊగిసలాట

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market | యూఎస్‌ సుంకాల అనిశ్చితి కొనసాగుతోంది. ఈ నేపథ్యంతో ఇన్వెస్టర్లు బై ఆన్‌...

    More like this