అక్షరటుడే, వెబ్‌డెస్క్: BJP State Chief | చెరువును ఆక్రమించి నిర్మించిన అక్బరుద్దీన్ ఒవైసీ కాలేజీ భవనాన్ని ఎందుకు కూల్చడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు(BJP state president Ramachandra Rao) ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలను కూల్చడానికి ప్రభుత్వం హైడ్రా(Hydraa)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. హైడ్రా అధికారులు చెరువుల్లో నిర్మించిన పలు కట్టడాలను తొలగించారు. అయితే అక్బరుద్దీన్ కాలేజీ(Akbaruddin College) జోలికి మాత్రం ఇప్పటి వరకు వెళ్లలేదు. ఈ క్రమంలో బీజేపీ అధ్యక్షుడిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన రామచందర్‌రావు ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
BJP State Chief | మేమే కూలుస్తాం
మూసీ ప్రాంత పేదల జీవితాలు ప్రభుత్వానికి పట్టవా అని ఆయన ప్రశ్నించారు. మూసీ పునరుజ్జీవం పేరుతో నదీ సమీపంలోని పేదల తరలిస్తున్న ప్రభుత్వం అక్బరుద్దీన్ కాలేజీ భవనాన్ని ఎందుకు కూల్చడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం కూల్చకపోతే ప్రజల తరపున తామే ఆ భవనాన్ని కూల్చేస్తామని రామచందర్ రావు(Ramachandra Rao) హెచ్చరించారు.
అక్బరుద్దీన్‌కు ఒక న్యాయం, పేదలకు మరో న్యాయమా అని ఆయన ప్రశ్నించారు. అక్బరుద్దీన్ కాలేజీల్లో చదివే వాళ్ల జీవితాలే మీకు ముఖ్యమా?.. మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న పేదల జీవితాలు మీకు పట్టవా అన్నారు. తక్షణమే అక్రమంగా నిర్మించిన అక్బరుద్దీన్ కాలేజీ భవనాన్ని కూల్చివేయాలని ఆయన డిమాండ్ చేశారు.
BJP State Chief | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఛాలెంజ్
జూబ్లీహిల్స్(Jubilee Hills) ఉప ఎన్నిక తమ పార్టీకి ఛాలెంజ్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్(Maganti Gopinath) ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో త్వరలో అక్కడ ఉప ఎన్నిక రానుంది. ఈ మేరకు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఆ సీటును ఎలాగైనా గెలవాలని ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ క్రమంలో రామచందర్‌రావు మాట్లాడుతూ.. గత ఎన్నికల కంటే ఇప్పుడు సమీకరణాలు మారుతున్నాయన్నారు. ఉపఎన్నికలో కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉండదని జోస్యం చెప్పారు.
BJP Chief Ramachandra Rao | స్థానిక ఎన్నికలపై ఫోకస్
రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలపై ఫోకస్ పెట్టినట్లు కాషాయ దళాధిపతి పేర్కొన్నారు. ఇక నుంచి ప్రతీ ఎన్నికను సీరియస్‌గా తీసుకుంటామన్నారు. లోకల్ బాడీ ఎలక్షన్లలో(Local Body Elections) ఎక్కువ సీట్లు గెలవడమే లక్ష్యంగా పని చేస్తామని ఆయన పేర్కొన్నారు. త్వరలో బీజేపీ కొత్త వర్కింగ్ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. పార్టీలో గ్రూపులు లేకుండా.. అందరు కలిసి పని చేసేలా చేస్తానన్నారు.
Read all the Latest News on Aksharatoday.in