More
    Homeటెక్నాలజీWhatsapp | వాట్సాప్‌లో క్రేజీ ఫీచ‌ర్.. ఇక మీ నుండి మీ చాటింగ్ సీక్రెట్!

    Whatsapp | వాట్సాప్‌లో క్రేజీ ఫీచ‌ర్.. ఇక మీ నుండి మీ చాటింగ్ సీక్రెట్!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Whatsapp | ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్ (WhatsApp) ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఫీచ‌ర్స్‌ని తీసుకొస్తూ ఉండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. చాలా మంది వాట్సాప్ ద్వారా ఎన్నో ప‌నులు చ‌క్క‌బెడుతున్నారు. యూజర్లకు మరింత అనువుగా ఉండేలా వాట్సాప్ మాతృ సంస్థ మెటా ఎప్పటిక‌ప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. తాజాగా వాట్సాప్‌కి సంబంధించి “లాగ్ అవుట్” (Log Out) అనే ఒక కొత్త ఫీచర్‌ తీసుకువస్తుందన్న వార్త నెట్టింట వైర‌ల్ అవుతుంది. ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా (social media) ప్లాట్‌ఫాంలలో మీరు లాగౌట్ అయ్యే అవ‌కాశం ఉంటుంది.

    Whatsapp | క్రేజీ ఫీచ‌ర్..

    కాని వాట్సాప్ లో ఇప్ప‌టి వ‌ర‌కు అలాంటి ఛాన్స్ లేదు. మెసేజ్‌లు, నోటిఫికేష‌న్స్‌తో (messages and notifications) విసిగిపోయేవారు తాత్కాలికంగా మొబైల్ డేటా లేదా వైఫైను ఆఫ్ చేసుకుంటారు. అదే ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా (social media) ప్లాట్‌ఫాంలలో లాగ్ అవుట్ అయిపోవచ్చు. అప్పుడు నోటిఫికేషన్ ఏమీ రావు. మళ్లీ లాగ్ ఇన్ అయినప్పుడు అన్నీ కనిపిస్తాయి. యూజర్లు చాలా కాలంగా ఎదురు చూస్తున్న లాగౌట్‌ (Log out) అనే ఫీచర్‌ త్వరలో రిలీజ్ కానుంది. ఇది అందుబాటులోకి వస్తే వాట్సాప్ యూజర్లు యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ (uninstal) చేయకుండా లేదా చాట్ హిస్టరీని డిలీట్‌ చేయకుండానే లాగ్ ఔట్ కావచ్చు.

    ఆండ్రాయిడ్ అథారిటీ (Android Authority), టెక్ టిప్‌స్టర్ అసెంబుల్‌డీబగ్‌లో ఈ అప్‌డేట్ గురించి రివీల్ చేశారు. లేటెస్ట్‌ వాట్సాప్ బీటా (వెర్షన్ 2.25.17.37)లో అప్‌డేట్‌ (Update) కనిపించిందని, ఇది ఇంకా డెవలప్‌మెంట్‌లో ఉందని తెలిపింది. ఇది యాప్‌ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా మార్చనుంది. త్వరలో యాప్ సెట్టింగ్స్‌లో కనిపించే కొత్త లాగౌట్‌ ఫీచర్ (logout feature) చాలా సమస్యల‌ను దూరం చేస్తుంది.

    దీంట్లో మూడు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి.. మీ అన్ని చాట్స్, మీడియా, సెట్టింగ్స్‌ పూర్తిగా రిమూవ్ చేస్తుంది. మీరు ఏ డివైస్‌లో వాట్సాప్ వాడుతున్నారో దాన్ని డీఆక్టివేట్ చేయకుండా, తాత్కాలికంగా వాట్సాప్‌ను ఆ డివైస్‌లో నుంచి లాగ్ అవుట్ చేయవచ్చు. కొత్త లాగౌట్‌ ఆప్షన్‌తో వాట్సాప్‌ టెలిగ్రామ్, సిగ్నల్‌కి ఈక్వల్‌ కానుంది. ఈ యాప్‌లలో ఇప్పటికే యూజర్లు తాత్కాలికంగా సైన్ అవుట్ అయ్యే ఆప్షన్‌ ఉంది.మెటా (Meta), లాగౌట్‌ ఫీచర్ లాంచ్‌ అయ్యే తేదీని అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పటికీ బీటా స్టేజ్‌లో ఉంది

    Latest articles

    TASK Training | నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 4,100 ఉద్యోగాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : TASK Training | నిరుద్యోగ యువతకు మంత్రి శ్రీధర్ బాబు గుడ్ న్యూస్ చెప్పారు....

    Kamareddy | భార్య కాపురానికి రావడం లేదని భర్త సూసైడ్

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | భార్య కాపురానికి రావడం లేదని ఓ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. ఈ ఘటన...

    G-7 Summit | ప్రధాని నరేంద్ర మోదీకి జీ-7 ఆహ్వానం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : G-7 Summit | భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)కి జీ–7 సదస్సుకు...

    Kamareddy | నాలుగేళ్ల కొడుకును చెరువులో తోసేసి తల్లి ఆత్మహత్య

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ తల్లి తన కొడుకును చెరువులో...

    More like this

    TASK Training | నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 4,100 ఉద్యోగాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : TASK Training | నిరుద్యోగ యువతకు మంత్రి శ్రీధర్ బాబు గుడ్ న్యూస్ చెప్పారు....

    Kamareddy | భార్య కాపురానికి రావడం లేదని భర్త సూసైడ్

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | భార్య కాపురానికి రావడం లేదని ఓ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. ఈ ఘటన...

    G-7 Summit | ప్రధాని నరేంద్ర మోదీకి జీ-7 ఆహ్వానం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : G-7 Summit | భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)కి జీ–7 సదస్సుకు...