ePaper
More
    Homeఅంతర్జాతీయంB-2 Aircraft Group | ఆ విమానాలు ఏమయ్యాయి?.. ఇరాన్‌పై దాడి తర్వాత తిరిగి రాని...

    B-2 Aircraft Group | ఆ విమానాలు ఏమయ్యాయి?.. ఇరాన్‌పై దాడి తర్వాత తిరిగి రాని బీ-2 విమానాల బృందం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: B-2 Aircraft Group | ఇరాన్ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా వైమానిక దళం (US Air Force) చేపట్టిన బాంబు దాడి ఊహించని మలుపు తిరిగింది. ఇందులో పాల్గొన్న B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్లలో (B-2 Spirit stealth bombers) ఒక బృందం స్థావరానికి తిరిగి రాలేదు. దాని ఆచూకీ తెలియక పోవడంతో అనేక సందేహాలు రేకెత్తుతున్నాయి. ఇరాన్ పై దాడికి జూన్ 21న మిస్సోరీలోని వైట్మన్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి అమెరికా రెండు వేర్వేరు B-2 బాంబర్ల బృందాలను మోహరించింది. ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలను తప్పుదారి పట్టించేందుకు ఒక బృందం పసిఫిక్ మీదుగా పశ్చిమ దిశగా ప్రయాణించింది. ఏడు B-2లతో కూడిన రెండవ బృందం టెహ్రాన్లోని ఫోర్డో, నటాంజ్లోని భూగర్భ అణు కేంద్రాలపై దాడి చేయడానికి తూర్పు వైపుకు వెళ్లింది. సదరు స్ట్రైక్ బృందం తన మిషన్ను పూర్తి చేసి, 37 గంటల నిరంతర ప్రయాణం తర్వాత స్థావరానికి తిరిగి వచ్చింది. కానీ పసిఫిక్ వైపు ప్రయాణించిన డెకాయ్ బృందం జాడ తెలియకుండా పోయింది.

    READ ALSO  America | భారత్​కు అమెరికా హెచ్చరిక..! రష్యాతో వ్యాపారం చేస్తే 500 శాతం సుంకం!

    B-2 Aircraft Group | హవాయిలో కనిపించిన బీ-2

    బీ-2 బాంబర్ల బృందం (group of B-2 bombers) కనిపించకుండా పోయిన ఉదంతంపై అమెరికా నుంచి ఇప్పటిదాకా అధికారిక ప్రకటన రాలేదు. అయితే, ఆ బృందంలోని ఓ విమానం ఆచూకీ తాజాగా లభ్యం కావడం చర్చనీయాంశమైంది. పశ్చిమ వైపు ప్రయాణించిన బీ-2 విమానాల బృందంలోని ఓ విమానం హవాయిలో అత్యవసరంగా ల్యాండింగ్ (emergency landing in Hawaii) అయిందన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హోనోలులులోని హికామ్ ఎయిర్ ఫోర్స్ బేస్తో రన్వేలను పంచుకునే డేనియల్ కె. ఇనోయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్టెల్త్ బాంబర్ దిగినట్లు తెలుస్తోంది. ఎయిర్ పోర్టులో పార్కింగ్ చేసిన ఉన్న బీ-2 బాంబర్ వీడియో ఆన్ లైన్ లో వైరల్ అయింది. అయితే, అమెరికా వెళ్లాల్సిన ఈ విమానం ఎందుకు ఇక్కడ ల్యాండ్ అయిందన్న దానికి గల కారణాలు తెలియరాలేదు. ఏదైనా ఎమర్జెన్సీ తలెత్తడంతో ఇక్కడ అత్యవసరంగా ల్యాండ్ చేసి ఉండొచ్చని భావిస్తున్నారు.

    READ ALSO  One Beautiful Bill | క‌ల‌ల బిల్లుకు ట్రంప్ ఆమోదం.. వ‌న్ బ్యూటీఫుల్ బిల్లుపై సంత‌కం

    అత్యాధునిక స్టెల్త్ ఫైటర్ జెట్ (stealth fighter jet) అయిన బీ-2 బాంబర్ అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఏప్రిల్ 2023లో కూడా హవాయిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్లు అయింది. 2022లో మిస్సౌరీలో జరిగిన ప్రమాదం తర్వాత మొత్తం B-2 విమానాలను తాత్కాలికంగా నిలిపివేశారు. 2008లో ఓ బీ-2 బాంబర్ తీవ్ర ప్రమాదానికి గురైంది. గ్వామ్ లోని అండర్సన్ వైమానిక దళ స్థావరం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే “స్పిరిట్ ఆఫ్ కాన్సాస్” కూలిపోయింది. అయితే ఇద్దరు సిబ్బంది సురక్షితంగా బయటకు వచ్చారు.

    Latest articles

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....

    Hydraa Commissioner | నాలాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hydraa Commissioner | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో నాలాలను హైడ్రా...

    Nizamabad CP | విద్యాసంస్థలపై దాడి చేస్తే కఠిన చర్యలు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad CP | విద్యా సంస్థలపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని...

    Operation Sindoor | రాఫెల్ జెట్ల కూల్చివేతపై పాక్ ఆరోపణలు అవాస్తవం.. స్పష్టం చేసిన డస్సాల్ట్ ఏవియేషన్ ఛైర్మన్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Operation Sindoor | ఆపరేషన్ సిందూర్ సమయంలో రాఫెల్ జెట్ యుద్ధ విమానాలను కూల్చివేశామన్న పాకిస్తాన్...

    More like this

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....

    Hydraa Commissioner | నాలాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hydraa Commissioner | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో నాలాలను హైడ్రా...

    Nizamabad CP | విద్యాసంస్థలపై దాడి చేస్తే కఠిన చర్యలు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad CP | విద్యా సంస్థలపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని...