అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ahmedabad Plane Crash | అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం(Air India plane) జూన్ 12న కూలిపోయిన విషయం తెలిసిందే.
ఈ ఘటనలో విమానంలోని 241 మంది మృతి చెందారు. అంతేగాకుండా విమానం బీజే మెడికల్ కాలేజీ భవనం(BJ Medical College Building)పై పడటంతో అందులోని వైద్య విద్యార్థులు కూడా చనిపోయారు. మొత్తం 270 మంది ఈ ప్రమాదంలో మృతి చెందారు. అయితే విమాన ప్రమాదానికి ముందు ఏం జరిగిందనే దానిపై తాజాగా ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రాథమిక నివేదిక అందించింది.
Ahmedabad Plane Crash | ఆ స్వీచ్‌లు ఆగిపోవడంతో..
అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరగడంతో ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (Aircraft Accident Investigation Bureau) విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. విమాన ఇంజిన్ల ఇంధన కంట్రోల్ స్విచ్‌లు ఆగిపోవడంతోనే ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా బ్యూరో నిర్ధారించింది.
ప్రమాదానికి ముందు కాక్‌పిట్‌లో ఏ జరిగిందన్న వివరాలను నివేదికలో AAIB వెల్లడించింది. విమానం గరిష్ఠ వేగమైన 180 నాట్స్‌ను అందుకున్న మరుక్షణమే ‘రన్’ నుంచి ‘కటాఫ్’ పొజిషన్‌కు ఇంజిన్–1, ఇంజిన్ –2కు చెందిన ఇంధన స్విచ్‌లు మారాయని తెలిపింది. ఇంధన సరఫరా నిలిచిపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు పేర్కొంది.
ఇంజిన్లకు ఇంధన సరఫరా ఆగిపోవడంతో ఇంజిన్లు రెండూ టేకాఫ్ వేగం నుంచి తగ్గుతూ వచ్చాయి. దీంతో స్విచ్‌లు ఎందుకు ఆపారంటూ ఒక పైలట్ మరో పైలట్‌ను ప్రశ్నించగా తాను చేయలేదని ఆయన తెలిపారు. ఈ మేరకు బ్లాక్ బాక్స్ (Black Box)లో రికార్డు అయింది. దీంతో ఎయిర్‌పోర్టు పెరీమీటర్ గోడను దాటిన వెంటనే ఎత్తు తగ్గుతూ వచ్చి కూలిపోయింది.
Ahmedabad Plane Crash | మేడే సందేశం..
మొదటి ఇంజిన్, రెండో ఇంజిన్ ఇంధన స్విచ్ ‘కటాఫ్’ నుంచి మళ్లీ ‘రన్’కు మారినా.. రెండో ఇంజిన్ మాత్రం నిర్దిష్ట వేగాన్ని అందుకోలేకపోయింది. దీంతో మధ్యాహ్నం 1:39 గంటలకు పైలెట్ మేడే కాల్ (Pilot Mayday Call) ఇచ్చారు. అనంతరం వెంటనే విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో 270 మంది మృతి చెందారు. అందులో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కూడా ఉన్నారు.
Read all the Latest News on Aksharatoday and also follow us in ‘X‘ and ‘Facebook‘