అక్షరటుడే, వెబ్డెస్క్: బంగారం ధరలు కాస్త శాంతిస్తుండడం శుభ పరిణామం అనే చెప్పాలి. గత నాలుగు రోజులుగా బంగారం ధరలు ఊహించని విధంగా తగ్గుముఖం పట్టడంతో మహిళలు Womens సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధర బాగానే తగ్గినట్లు కనిపిస్తోంది. ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాముకు రూ.9,550లు కాగా, 22 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాము రూ.8,754లుగా ఉంది. ఇకపోతే,18 క్యారెట్ల బంగారం ధర1 గ్రాము రూ.7,163లుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం వలన బంగారం ధరలు క్రమేపి తగ్గుతున్నాయి. ఆ మధ్య లకారం చేరుకోవడంతో అందరు ఉలిక్కిపడ్డారు. ఇప్పుడు మెల్లగా తగ్గుతుండడం శుభపరిణామం అనే చెప్పాలి.
Today gold price | క్రమేపి తగ్గుదల..
ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి Gold ధర రూ.87,690, 24 క్యారెట్ల ధర రూ.95,650 గా ఉంది.ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.87,540, 24 క్యారెట్ల ధర రూ.95,500 గా ఉంది.చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.87,540, 24 క్యారెట్ల రేటు రూ.95,500 గా ఉంది.బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.87,540, 24 క్యారెట్ల ధర రూ.95,500 గా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.87,540, 24 క్యారెట్ల ధర రూ.95,500 గా 4ఉంది.విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.87,540, 24 క్యారెట్ల ధర రూ.95,500 గా ఉంది.
ఇకపోతే, బంగారంతో పాటుగా వెండికి కూడా ఇప్పుడు డిమాండ్ పెరిగింది. అందుకు తగ్గట్టుగానే వెండి Silver ధరలు కూడా భారీగా పెరుగుతూ వస్తున్నాయి. సిల్వర్ నగల కోసం మాత్రమే కాదు పారిశ్రామికంగా కూడా పెద్ద ఎత్తున వినియోగం అవుతుంది.. ఇక్కడ మరో ముఖ్య విషయం ఏంటంటే.. ప్రపంచంలోనే అతిపెద్ద వెండి వినియోగదారు మన దేశమే అని చెబుతున్నారు. నేటి వెండి ధర గ్రాము రూ.108.90లు కాగా, కిలో వెండి ధర రూ. 1,08,900లుగా ఉంది.హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,08,900 కాగా, విజయవాడ, విశాఖపట్నంలో రూ.1,08,000గా ఉంది. ఢిల్లీలో వెండి కిలో ధర రూ.97,900, ముంబైలో రూ.97,900, బెంగళూరులో రూ.97,900, చెన్నైలో రూ.1,08,000 లుగా ఉంది.