అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | మైనారిటీల అభ్యున్నతికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మైనార్టీ కమిషన్ ఛైర్మన్ తారిక్ అన్సారీ (Tariq Ansari) సూచించారు. నగరంలోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో మంగళవారం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో (Collector Vinay Krishna Reddy) పాటు ఇతర అధికారులతో భేటీ అయ్యారు. జిల్లాలో మైనారిటీ వర్గాల స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వం మహిళలకు అందజేస్తున్న తోడ్పాటును అర్హులైన మైనార్టీ మహిళలు (minority women) వినియోగించుకునేలా చొరవ చూపాలని కోరారు. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో మైనార్టీలకు సరైన ప్రాతినిధ్యం లభించేలా జిల్లా యంత్రాంగం తరపున ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలన్నారు. దాడులు జరిగిన సందర్భాల్లో పోలీసు అధికారులు సత్వరమే స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిణి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.