అక్షరటుడే, వెబ్డెస్క్ : Pashamylaram | సంగారెడ్డి జిల్లా పాశమైలారం పేలుడు ఘటనలో బాధిత కుటుంబాలను ఆదుకుంటామని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్(PCC Chief Mahesh Goud) అన్నారు. బుధవారం ఉదయం ఆయన ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పాశమైలారంలోని సిగాచి ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలుడు(Reactor Explosion) చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 36 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.
Pashamylaram | 13 మంది ఆచూకీ గల్లంతు
రియాక్టర్ పేలుడు దాటికి పలు భవనాలు కూలిపోయాయి. దీంతో శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయారు. ఇప్పటి వరకు కంపెనీలోని 13 మంది ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో శిథిలాల కింద వారు చిక్కుకొని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
Pashamylaram | పరిశీలించిన మీనాక్షి నటరాజన్
కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలిసి మంగళవారం ఉదయం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy) సోమవారం ఫ్యాక్టరీని పరిశీలించి మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు. అలాగే కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి రూ.కోటి చొప్పున పరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఫ్యాక్టరీని పరిశీలించారు. సీఎం రేవంత్ రెడ్డి మాట ఇచ్చిన ప్రకారం బాధిత కుటుంబాలను ఆదుకుంటామన్నారు. ఈ ఘటనపై రాహుల్ గాంధీ(Rahul Gandhi) విచారం వ్యక్తం చేశారని పేర్కొన్నారు.
Pashamylaram | కంపెనీ యాజమాన్యంపై కేసు
పాశమైలారం(Pashamylaram) సిగాచి కంపెనీలో రియాక్టర్ పేలుడుకు కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణమని పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే బాధితుల రక్షణ చర్యలు చేపట్టలేదన్నారు. మరోవైపు పరిహారం విషయంలో కూడా కంపెనీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.