అక్షరటుడే, వెబ్‌డెస్క్:PCC Chief | ఒక మతాన్ని కించపర్చే విధంగా చట్టాలు సవరిస్తే తాము తప్పకుండా వ్యతిరేకిస్తామని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(PCC President Mahesh Kumar Goud) వ్యాఖ్యానించారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ nizamabad congress party పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వక్ఫ్ చట్టం(Waqf Act)లో ఏదైనా లోటుపాట్లు ఉంటే సవరించడంలో తప్పు లేదన్నారు. కానీ లౌకికవాద దేశంలో ఒక మతాన్ని కించపర్చే విధంగా సవరణ చేస్తే ఊరుకోమన్నారు. అయినా వక్ఫ్ చట్టం బిల్లు ప్రస్తుతం సుప్రీంకోర్టు(Supreme Court)లో ఉందని, న్యాయమే గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
PCC Chief | రైతుల పార్టీ కాంగ్రెస్..
కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి అని చెప్పడానికి కారణం జిల్లాలో కొనసాగుతున్న రైతు మేళా(Raithu Mela)నే సాక్ష్యమని పీసీసీ చీఫ్ అన్నారు. రాష్ట్రంలో పేరుగాంచిన శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, అనుభవజ్ఞులు రైతులకు అధునాతన పద్ధతులు నేర్పుతున్నారన్నారు. బీఆర్ఎస్ హయాంలో రైతులు(Farmers) వరికుప్పల మీద ప్రాణాలు విడిచిపెట్టిన ఘటనలు మర్చిపోలేమన్నారు. రైతులపై లాఠీచార్జి చేసిన ఘనత కేసీఆర్(KCR)కే దక్కుతుందన్నారు. జిల్లాలో బీఆర్ఎస్(BRS) పని ముగిసిందన్నారు.
ఉమ్మడిజిల్లాలోని నిజాంసాగర్ nizamsagar project, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు srsp (Sriram Sagar project) పూడికతీతకు ఎంత ఖర్చయినా తొలగిస్తామని తెలిపారు. ఎంత వ్యయమైనా వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. ఇప్పటికే సన్న బియ్యం, రూ.500 బోనస్ ఇస్తున్నామని గుర్తు చేశారు. అలాగే జిల్లాలో మినీ స్టేడియం(mini stadium), సింథటిక్ ట్రాక్(synthetic track) తొందరలోనే రాబోతుందని పేర్కొన్నారు. సమావేశంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి bodhan mla sudarshan reddy, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి dcc president manala mohan reddy, రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, నుడా ఛైర్మన్ కేశవేణు, ఎన్ఎస్యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణురాజ్, తదితరులు పాల్గొన్నారు.