అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rahul Gnadhi | త్వరలో జరుగనున్న బీహార్ ఎన్నికల్లో(Bihar Elections) రిగ్గింగ్ జరుగకుండా అడ్డుకుంటామని లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్‌గాంధీ అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మరోసారి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అంశాన్ని ప్రస్తావించారు. మహారాష్ట్ర ఎన్నిల్లో రిగ్గింగ్ జరిగిందని బీహార్‌లో కూడా ఇలాంటి ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, నూతన కార్మిక కోడ్, క్షీణిస్తున్న శాంతిభద్రతలకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు పిలుపునిచ్చిన రాష్ట్ర వ్యాప్త బంద్‌లో భాగంగా పాట్నాలో నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్‌గాంధీ(Rahul Gandhi) పాల్గొన్నారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా, సీపీఐ (మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్ నాయకుడు దీపాంకర్ భట్టాచార్య, బీహార్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ రామ్(Bihar Congress President Rajesh Ram), కన్హయ్య కుమార్. సంజయ్ యాదవ్‌తో సహా ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (ఇండియా) బ్లాక్‌కు చెందిన పలువురు సీనియర్ నాయకులు కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్‌గాంధీ మాట్లాడుతూ.. బీజేపీతో పాటు ఎన్నికల సంఘంపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు.
Rahul Gnadhi | పేదల హక్కులు లాక్కుంటున్నారు..
ఎన్నికల సంఘం పేద ప్రజల ఓటు హక్కును లాక్కుంటోందని రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఎన్నికల ముందర ప్రత్యేక ఇంటెన్సివ్ ఓటర్ల జాబితా సవరణ చేపట్టడంపై అసహనం వ్యక్తంచేశారు. “ఎన్నికల కమిషన్, ప్రత్యేక ఇంటెన్సివ్ ఓటర్ల జాబితా సవరణ ద్వారా.. వలసదారులు, దళితులు, పేద ఓటర్ల ఓటు హక్కులను లాక్కుంటోంది. ఈ సంవత్సరం చివర్లో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు(Bihar Assembly Elections) ముందు ఓట్లను తొలగించేందుకు చేస్తున్న కుట్ర ఇది” అని ఆయన ఆరోపించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగినట్లు బీహార్‌లో చేస్తామంటే కుదరదని, ఇక్కడ రిగ్గింగ్ జరుగకుండా మహాఘట్ బంధన్ కూటమి అడ్డుకుంటుందని చెప్పారు.