అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Amit shah | ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని కేంద్ర హోం మంత్రి central home minister amit shah అమిత్షా అన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత తొలిసారి ఆయన మాట్లాడారు.
ఉగ్రవాదులు ఎక్కడున్నా వెతికి పట్టుకొని శిక్షిస్తామన్నారు. దాడి చేసి విజయం సాధించామని అనుకుంటే పొరపాటు అన్నారు. ఇక్కడ ఉన్నది మోదీ సర్కార్ modi Sarkar అని అమిత్ షా స్పష్టం చేశారు. ఉగ్రవాదులను శిక్షించే వరకు ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. ఉగ్రవాదంపై పోరులో 140 కోట్ల భారతీయులే కాకుండా ప్రపంచ దేశాలు అండగా నిలుస్తున్నాయని తెలిపారు. పహల్గామ్లో దాడికి పాల్పడిన వారికి కచ్చితంగా తగిన శిక్ష వేస్తామని షా పేర్కొన్నారు.