అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rajnath Singh | ఆదివాసీలను పట్టి పీడిస్తున్న నక్సలిజాన్ని నిర్మూలిస్తామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాథ్నాథ్ సింగ్ (Union Minister Rajnath Singh) అన్నారు. నక్సలిజం లేని దేశాన్ని నిర్మిస్తామన్నారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో శుక్రవారం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు (Alluri Seetharama Raju) జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్‌నాథ్ సింగ్ హాజరై మాట్లాడారు.
అల్లూరి సీతారామరాజు విప్లవం కేవలం యావత్ భారతానికి వ్యాపించిందన్నారు. అల్లూరి శౌర్యం, వీరత్వం బ్రిటీష్ సామ్రాజ్యాన్ని భయపడేలా చేసిందని పేర్కొన్నారు. గెరిల్లా యుద్ధ నైపుణ్యాలతో ఆయన ఆధునిక ఆయుధాలు ఉన్న బ్రిటిష్ సైనికులను ముచ్చెమటలు పట్టించారని కొనియాడారు. ఆదివాసీల హక్కులను కాలరాసిన బ్రిటీష్ వారికి సరైన బుద్ధి చెప్పారన్నారు. అల్లూరి సీతారామరాజు పుట్టిన గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.
Rajnath Singh | మన బలమేంటో చూపించాం
ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) చేపట్టి పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశామని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. సామాన్య పౌరులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఈ ఆపరేషన్ చేపట్టామన్నారు. ఈ ఆపరేషన్‌తో దాయాది దేశంతో పాటు ప్రపంచానికి మన బలం ఏమిటో చూపెట్టామని ఆయన పేర్కొన్నారు.