అక్షరటుడే, ఇందూరు:VHP Nizamabad | జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడి(Terror Attack)ని తీవ్రంగా ఖండిస్తున్నామని వీహెచ్పీ జిల్లా సహ కార్యదర్శి దాత్రిక రమేశ్(VHP District Joint Secretary Datrika Ramesh) అన్నారు. శుక్రవారం నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ఉగ్రవాదుల(Terrorist) దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మరో సర్జికల్ స్ట్రైక్(Surgical Strike) చేసి ఉగ్రవాదుల పనిపట్టాలన్నారు.
కార్యక్రమంలో వీహెచ్పీ జిల్లా కార్యదర్శి దయానంద్, ఉపాధ్యక్షుడు ఆనంద్, కోశాధికారి శేఖర్, సంపర్క్ ప్రముఖ్ శేఖర్, నగర అధ్యక్షుడు శ్రీనివాస్, బజరంగ్దళ్ జిల్లా సహా సంయోజక మహేష్, నగర సహ సంయోజన్ సురేష్, సాయికిరణ్, తరుణ్, కార్తీక్ రాజ్పుత్ తదితరులు పాల్గొన్నారు.