అక్షరటుడే, ఆర్మూర్:Armoor Police | పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతిఒక్కరు పోలీసులకు సహకరించాలని ఏసీపీ వెంకటేశ్వర్‌రెడ్డి(Armoor ACP Venkateswar Reddy) కోరారు. ప్రొబేషనరీ ఐపీఎస్ సాయికిరణ్(Probationary IPS Sai Kiran) ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని కమల నెహ్రు కాలనీ, టీచర్స్ కాలనీల్లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం(Contact program) నిర్వహించారు.
ఈ సందర్భంగా సరైన ధ్రువపత్రాలు లేని 55 బైక్‌లు, 5 ఆటోలు, కారును స్వాధీనం చేసుకున్నారు. అలాగే నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్, మోడిఫైడ్ సైలెన్సర్లు బిగించిన వాహనాలను స్టేషన్(Station)కు తరలించారు. కార్యక్రమంలో సీఐలు సత్యనారాయణ ci satyanarayana armoor, శ్రీధర్, ఎస్సైలు, ఏఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.