అక్షరటుడే, వెబ్డెస్క్ : Maoists | మంత్రి సీతక్క (Minister Seethakk)ను హెచ్చరిస్తూ ఇటీవల మావోయిస్టుల పేరుతో లేఖ విడుదలైన విషయం తెలిసిందే. ఆదివాసీల హక్కుల గురించి సీతక్క పట్టించుకోవడం లేదని ఇటీవల మావోయిస్టుల పేరిట లేఖ విడుదలైంది. జీవో 49తో ఆదివాసీలకు అన్యాయం జరుగుతున్న సీతక్క పట్టించుకోవడం లేదని అందులో ఉంది. అయితే ఆ లేఖతో తమకు సంబంధం లేదని మావోయిస్టులు (Maosits) ప్రకటించారు. ఈ మేరకు తెలంగాణ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ (Jagan) శనివారం లేఖ విడుదల చేశారు.
Maoists | ఆ ప్రచారంలో వాస్తవం లేదు
మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే దామోదర్ (Bade Damodhar) లొంగిపోతున్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని మావోయిస్టులు కొట్టి పారేశారు. పోలీసులే ఉద్దేశపూర్వకంగా ఇలాంటి ప్రచారాలు చేయిస్తున్నారని వారు ఆరోపించారు. గతంలో కూడా దామోదర్ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారని ప్రచారం చేశారన్నారు. ములుగు, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఆదివాసీలను పోలీసులు (Police) బెదిరింపులకు గురిచేస్తున్నారని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు.