అక్షరటుడే, వెబ్‌డెస్క్: Operation Sindoor | భారత డిప్యూటీ ఆర్మీ చీఫ్ రాహుల్ ఆర్‌సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ ఒకేసారి మూడు దేశాలతో యుద్ధం చేసిందని ఆయన పేర్కొన్నారు. మూడు దేశాలను యుద్ధ రంగంలో ఓడించామని ఆయన తెలిపారు. ఫిక్కి నిర్వహించిన న్యూ ఏజ్ మిలిటరీ టెక్నాలజీస్ (New Age Military Technologies) కార్యక్రమంలో శుక్రవారం ఆయన మాట్లాడారు.
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూరు(Operation Sindoor) చేపట్టి పాక్, పీవోకేలోని తొమ్మిది ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. భారత్ దెబ్బతో షాకైన పాక్ తర్వాత డ్రోన్లు, క్షిపణులతో భారత్‌పై దాడులు చేసింది. అయితే భారత గగనతల రక్షణ వ్యవస్థ పాక్ దాడులను అడ్డుకుంది.
Operation Sindoor | ఆ దేశాలను ఓడించాం
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్(Pakistan)కు తుర్కీయే డ్రోన్లను సరఫరా చేసింది. చైనా కూడా ఆయుధాలు అందించినట్లు సమాచారం. పాక్ పలు చైనా క్షిపణులను ప్రయోగించినట్లు అధికారులు గుర్తించారు. దీంతో తాజాగా రాహుల్ ఆర్‌సింగ్(Rahul R Singh) మాట్లాడుతూ.. పాక్‌తో పాటు చైనా, తుర్కియేను ఓడించామన్నారు.
చైనా పాకిస్తాన్‌ను లైవ్ ల్యాబ్‌లా వాడుకుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్ ప్రయోగించిన పలు చైనా మిసైళ్లు(Chinese Missiles) పని లక్ష్యాన్ని చేరుకోకముందే కూలిపోయాయి. అలాగే చైనా నుంచి పాక్ కొనుగోలు చేసిన గగనతల రక్షణ వ్యవస్థ భారత దాడులను అడ్డుకోలేకపోయింది. అదే సమయంలో భారత్ రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎస్–400 సిస్టమ్ సమర్థవంతంగా పని చేసింది. ఈ క్రమంలో డిప్యూటీ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు చేశారు. తుర్కియే పైలట్లు నేరుగా యుద్ధంలో పాల్గొన్నారని ఆయన పేర్కొన్నారు. అలాగే చైనా పాకిస్తాన్‌కు ప్రత్యక్ష కార్యాచరణ డేటాను అందించిందని, భారత్‌పై నిఘా ఉంచిందని ఆయన తెలిపారు.