అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Manala Mohan Reddy | రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు (Indiramma Housing Scheme) మంజూరు చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్(State Cooperative Union Limited) ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. వేల్పూర్(Velpoor) మండలంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇంటిని సోమవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో ఇల్లు లేని పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వలేదన్నారు.
Manala Mohan Reddy | కేటీఆర్ ఆలోచించి మాట్లాడాలి
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అర్హులకు ఇళ్లు ఇవ్వని నాయకులకు.. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కులేదని మాజీ మంత్రి కేటీఆర్‌ను (Ex Minister KTR) ఉద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్లు మంజూరు చేసిందన్నారు.
అందులో భాగంగానే వేల్పూర్ మండలంలో లబ్ధిదారు గోదావరి ఇంటిని పరిశీలించామన్నారు. ఆయన వెంట పార్టీ మండలాధ్యక్షుడు గడ్డం నర్సారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నరేందర్, దామోదర్ గౌడ్ గ్రామ శాఖ అధ్యక్షుడు మల్లేష్, ఇంద్రమ్మ కమిటీ సభ్యులు రమణ, రాజేందర్, రాజేశ్వర్, లావణ్య, లహరి ఉన్నారు.