అక్షరటుడే వెబ్ డెస్క్: Warren Buffet | ప్రపంచ దిగ్గజ పెట్టుబడిదారులలో world’s leading investors ఒకరైన 95 ఏళ్ల వారెన్ బఫెట్ (Warren Buffet) రిటైర్మెంట్ ప్రణాళికను retirement plan ప్రకటించారు. ఈ ఏడాది చివరి నాటికి బెర్క్‌షైర్ హాత్‌వే (Berkshire Hathway) కంపెనీ సీఈవో పదవిని వీడనున్నట్లు పేర్కొన్నారు. శనివారం జరిగిన కంపెనీ వాటాదారుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. తన రెండో కుమారుడు హువర్డ్ బఫెట్ కంపెనీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తారని, గ్రెగ్ అబెల్ సీఈవో(Greg Abel CEO)గా విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు.
గ్రెగ్ అబెల్(Greg Abel)పై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. అతడు తనకన్నా కంపెనీని సమర్థవంతంగా నిర్వహిస్తాడని పేర్కొన్నారు. సీఈవో పదవినుంచి CEO position వైదొలగుతున్నా.. కంపెనీలో వాటాలను అమ్మే ఉద్దేశం లేదన్నారు. తన రిటైర్మెంట్ retirement ప్రకటన గురించి తన ఇద్దరు పిల్లలైన హోవార్డ్, సూసీ బఫెట్‌లకు మాత్రమే తెలుసని, గ్రెగ్ అబెల్‌కు Greg Abel కూడా ఈ విషయం తెలియదని పేర్కొన్నారు.
Warren Buffet |పెట్టుబడి వ్యూహాలతో ఎందరికో స్ఫూర్తి..
వారెన్ బఫెట్ Warren Buffett ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన పెట్టుబడిదారు(Successful investor)లలో ఒకరుగా ప్రసిద్ధికెక్కారు . ఆయన 1930 ఆగస్టు 30న జన్మించారు. విలువ ఆధారిత పెట్టుబడి సిద్ధాంతాలపై కొలంబియా బిజినెస్ స్కూల్‌లో బెంజమిన్ గ్రాహం(Benjamin Graham) వద్ద శిక్షణ తీసుకున్నారు.
బలమైన ఆర్థిక పునాదులు ఉన్న కంపెనీలను ఎంచుకుని పెట్టుబడులు పెట్టేవారు. తక్కువ ధర వద్ద ట్రేడ్ అవుతున్న మంచి కంపెనీని గుర్తించి షేర్లు కొనేవారు. అవి మల్టీ బ్యాగర్లు(Multi baggers)గా మారి బఫెట్ సంపదను పెంచాయి. బెర్క్‌షైర్ హాత్‌వే సంస్థ ద్వారా అమెరికన్ ఎక్స్‌ప్రెస్, కొకాకోలా, ఆపిల్(Apple) వంటి కంపెనీలలో ఇన్వెస్ట్ చేసి బిలియనీర్‌గా మారారు. ఆయన సంపద విలువ వంద బిలియన్ డాలర్లకుపైనే ఉంటుంది. ఆయన తన పెట్టుబడి వ్యూహాలతో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు.