అక్షరటుడే, వెబ్‌డెస్క్: Padi Kaushik Reddy | బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌పై బీఆర్ఎస్ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ను సీఎం సీటు నుంచి దింపి ఆయన ముఖ్యమంత్రి కావాలని కుట్ర చేశారని ఆరోపించారు. ఈ మేరకు ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపారని.. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు(BRS MLA) ఆయన వెంట వెళ్లలేదన్నారు. అన్నం పెట్టిన వారికి సున్నం పెట్టిన చరిత్ర ఈటల రాజేందర్‌ది అని వ్యాఖ్యానించారు.
Padi Kaushik Reddy | బీజేపీని కూడా మోసం చేస్తారు
ఈటల కేసీఆర్‌పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్(KCR)ను విమర్శించే స్థాయి ఈటలది కాదన్నారు. ఈటలకు రాజకీయ భిక్ష పెట్టిందని కేసీఆర్ అన్నారు. అలాంటి నేతను ఈటల మోసం చేశారన్నారు. ఈటల పెద్ద మోసగాడు అని కౌశిక్‌రెడ్డి (Padi Kaushik Reddy )అన్నారు. కేసీఆర్‌ను, హుజురాబాద్ ప్రజలను మోసం చేశారన్నారు. భవిష్యత్‌లో బీజేపీని కూడా మోసం చేస్తారని పేర్కొన్నారు. ప్రజల భూములను లాక్కునందుకు కేసీఆర్ ఈటల రాజేందర్(Eatala Rajender)ను పార్టీ నుంచి తొలగించారని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న ఈటలను అధికారిక కార్యక్రమాలకు పిలిచామన్నారు. అయితే ఆయన అహంకారంతో హాజరు కాలేదని కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. పైగా తనను పిలవలేదని ఇప్పుడు అబండాలు వేయడం సరికాదన్నారు. ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు.