అక్షరటుడే, ఇందూరు: terrorist attack : భారత దేశంలో పర్యాటక కేంద్రంగా ఉన్న జమ్మూకశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల కాల్పులను నిరసిస్తూ నిజామాబాద్ వాకర్స్, యోగా అసోసియేషన్ ఆఫ్ తిలక్ గార్డెన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు టి. గంగాధర్ , ఎడ్ల ధనరాజ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఉగ్రదాడిలో మరణించిన వార ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు.
కార్యక్రమంలో వాకర్స్, యోగా అసోసియేషన్ ఆఫ్ తిలక్ గార్డెన్ కోశాధికారి పెంటన్న, దయానంద్, కిష్టన్న, మదన్, మోతిలాల్, రమేష్, సాయన్న, విజయ్ కుమార్, ముంతాజ్ , విశ్వనాథ్, శంకర్, నాగోజి, సుధాకర్, ఆకాశ్, గంగాధర్, సీనియర్ సిటిజెన్లు పాల్గొన్నారు.