అక్షరటుడే, వెబ్‌డెస్క్: Viral Video | ఈ ప్రపంచంలో చాలా మందికి పాములంటేనే భయం. పాము ఉందంటే అటు వైపు వెళ్లే ప్రయత్నం కూడా చేయరు. అలాంటిది ప్రపంచంలోని అత్యంత విషపూరిత పాముల్లో ఒకటైన కింగ్ కోబ్రా(King Cobra)ను చూస్తే మాత్రం ఒళ్లు జలదరిస్తుంది. కానీ ఓ వ్యక్తి మాత్రం ఎలాంటి భయానికి లోనవకుండా, నేరుగా తన చేతులతో ఒక భారీ కింగ్ కోబ్రాను పట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్(Viral Video) అవుతోంది.ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి(Indian Forest Service Officer) ప్రవీణ్ కస్వాన్ తన ఎక్స్ (మాజీ ట్విట్టర్) ఖాతాలో షేర్ చేశారు.
Viral Video | భారీ స్నేక్..
వీడియోలో ఒక వ్యక్తి భయపడకుండా, దాదాపు 18 అడుగుల పొడవు ఉన్న భారీ కింగ్ కోబ్రాను చేతితో పట్టుకుని నిలుచున్నాడు. ఈ సన్నివేశం చూసిన నెటిజన్లు ఆశ్చర్యంతో పాటు ఆందోళనకూ లోనవుతున్నారు. ప్రవీణ్ కస్వాన్ షేర్ చేసిన వీడియోకి కామెంట్‌గా.., “కింగ్ కోబ్రా ఎంత భారీగా ఉంటుందో మీకు తెలుసా? అలాంటి భారీ పాము భారతదేశంలో ఎక్కడ కనిపిస్తుందో తెలుసా? మీరు చూడగానే ఏమంటారు?” అంటూ ఆసక్తికర ప్రశ్నలతో ఫాలోవర్లను ఆలోచింపజేశారు. ఈ వీడియోపై ఇప్పటికే లక్షలాది మంది స్పందించగా, ఒక నెటిజన్, “నేను ఒకసారి అలాంటి కింగ్ కోబ్రాను చూశాను. దాని పొడవు కనీసం 17 అడుగులయుంటుంది. ఇంకెప్పుడూ అలాంటి దాన్ని చూడాలనుకోను, అని కామెంట్ చేశారు.
భారతదేశంలో ఇలాంటి కింగ్ కోబ్రాలు తూర్పు, పశ్చిమ కనుమలలో పాటు అసోం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్(Arunachal Pradesh) వంటి రాష్ట్రాల్లో కనిపిస్తాయి. వీటి పొడవు సాధారణంగా 18 అడుగులకు చేరుకుంటుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన విషపూరిత పాము కూడా. సాధారణంగా ఇవి మనుషుల జోలికి రాకుండా దూరంగా ఉంటాయంటూ నిపుణులు చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా అతగాడి గుండె ధైర్యానికి అందరు సలాం కొడుతున్నారు.