అక్షరటుడే, తిరుమల: TTD : తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చే సాధారణ భక్తుల సౌకర్యార్థం టీటీడీ (TTD) కీలక నిర్ణయం తీసుకుంది. జులై 15, 16 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను (Tirumala VIP Darshan) రద్దు చేసింది. ఈ మేరకు ప్రకటన జారీ చేసింది.
TTD : ప్రొటోకాల్ వారికే అనుమతి..
జులై 15, 16 తేదీల్లో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (Koil Alwar Thirumanjanam), ఆణివార ఆస్థానం (Anivara Asthanam) వంటి మహత్తర శ్రీవారి ఉత్సవాలు (Srivari festivals) నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ తెలిపింది. ఆయా రోజుల్లో ప్రొటోకాల్ (protocol) పరిధిలో ఉండే ప్రముఖుల సిఫారసులను మాత్రమే స్వీకరిస్తామని స్పష్టం చేసింది.
TTD : భక్తుల సహకారం కోరిన టీటీడీ
తిరుమల దేవస్థానం నిర్వహణకు భక్తులు తమ సహకారం అందించాలని టీటీడీ కోరింది. ఉత్సవాల సమయంలో భక్తులకు దర్శనాల్లో కొంత మార్పులు ఉంటాయని పేర్కొంది. ఈ మేరకు భక్తులు అర్థం చేసుకుని సహకరించాలని విజ్ఞప్తి చేసింది.