అక్షరటుడే, హైదరాబాద్: women protection : మహిళల భద్రత కోసం ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకొంటున్నా వారికి రక్షణ లేకుండా పోతోంది. ఇంటా, బయట అతివ ఏదో ఒక సందర్భంలో వేధింపులకు గురవుతోంది. అత్యాచార వేధింపులు, వికృత చేష్టలతో విసుగుపోతోంది.
తాజాగా హైదరాబాద్ లో hyderabad city ఓ మహిళ స్నానం చేస్తుండగా మొబైల్లో రహస్యంగా వీడియో తీసిన ఘటన వెలుగుచూసింది. ఈ కేసుకు సంబంధించి నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. జీహెచ్ఎంసీ GHMC hyderabad పరిధి మధురానగర్ కమ్యూనిటీ హాలులో పనిచేసే ఓ మహిళ సోమవారం(ఏప్రిల్ 21) ఉదయం బాత్రూమ్లో స్నానం చేస్తున్నారు. అదే సమయంలో గుంటూరుకు చెందిన మరియకుమార్(23 ) మధురానగర్ కమ్యూనిటీ హాలుకు వచ్చాడు. ఎలక్ట్రికల్ వర్క్ చేసుకునే ఈ యువకుడు బోరబండలో ఉంటాడు.
మధురానగర్ కమ్యూనిటీ హాలులో ఎలక్ట్రికల్ పని చేసేందుకు వచ్చిన మరియకుమార్.. బాత్రూమ్లో మహిళ స్నానం చేయడాన్ని గమనించి, తన జేబులో నుంచి మొబైల్‌ను తీసి దొంగచాటుగా వీడియోను చిత్రీకరించడం మొదలుపెట్టాడు. ఇంతలోనే అతను వీడియో తీయడం బాధిత మహిళ గమనించి గట్టిగా కేకలు వేశారు. దీంతో ఆ కీచక యువకుడు పారిపోయాడు.
కేకలు విన్న ఆ యువకుడు వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. బాధిత మహిళ మధురానగర్ పోలీస్ స్టేషన్‌కి madhuranagar police station వెళ్లి ఫిర్యాదు చేయడంతో, పోలీసులు దర్యాప్తు చేపట్టి, నిందుతుడిని అరెస్టు చేశారు.