అక్షరటుడే, వెబ్‌డెస్క్: Vice President | ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్(Jagdeep Dhankhad) రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) ఆమోదం తెలిపారు. ధన్ఖడ్ సోమవారం సాయంత్రం తన పదవికి ఆకస్మికంగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనారోగ్య కారణాలతో రిజైన్(Resign) చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
ఈ మేరకు తన రాజీనామాను రాష్ట్రపతికి పంపించారు. మంగళవారం ఆయన రాజీనామకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం తెలిపారు. దీంతో హోం మంత్రిత్వ శాఖ(Home Ministry) నూతన ఉప రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్(Notification) జారీ చేయనుంది.