అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kota Srinivas Rao | ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు (83) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. లెజెండరీ నటుడి మృతితో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన మరణంపై పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోటా శ్రీనివాసరావు దాదాపు 750కు పైగా సినిమాల్లో నటించారు.
Kota Srinivas Rao | బాల్యం నుంచే నాటకాలపై ఆసక్తి
కృష్ణాజిల్లా కంకిపాడులో 1942 జులై 10న కోట జన్మించారు. బాల్యం నుంచే ఆయనకు నాటకాలంటే ఎంతో ఆసక్తి ఉండేది. ఆయన సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు స్టేట్ బ్యాంకులో పనిచేశారు. 1968లో రుక్మిణితో వివాహం జరగగా.. వారికి ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు జన్మించారు. కాగా.. 2010లో జరిగిన రోడ్డుప్రమాదంలో కోటా శ్రీనివాస్ కుమారుడైన ప్రసాద్ మరణించారు.
Kota Srinivas Rao | అనేక నంది పురస్కారాలు
కోట శ్రీనివాసరావు 1978లో సినీ రంగంలో అడుగు పెట్టారు. ప్రాణం ఖరీదు సినిమాతో అరంగెట్రం చేశారు. ప్రతి ఘటన చిత్రంతో ఆయనకు విలన్‌గా మంచి గుర్తింపు వచ్చింది. అహ నా పెళ్లంట మూవీతో తిరుగులేని నటుడుగా ఎదిగారు. ఈ సినిమాలో ఆయన నటనతో ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించారు.
అయితే కోటా, బాబుమోహన్ ఇద్దరు కలిసిన సినిమా వచ్చిందంటే హిట్టే అనే టాక్ ఉండేది. వారిద్దరు కలిసి దాదాపు 50 సినిమాల్లో నటించారు. పిసినారి క్యారెక్టర్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూనే, విలన్‌గా రాణించి విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. కాగా ఆయన తన నటనతో తొమ్మిది నంది పురస్కారాలు దక్కించుకున్నారు.
Read all the Latest News on Aksharatoday and also follow us in ‘X‘ and ‘Facebook‘