అక్షరటుడే, ఇందూరు: జిల్లాలోని దివ్యాంగుల సహాయ ఉపకరణముల కోసం దరఖాస్తు చేసుకున్న వారి ధ్రువపత్రాలను మంగళవారం పరిశీలించారు. నగరంలోని కలెక్టరేట్లో మహిళా, శిశు, దివ్యాంగ సంక్షేమ శాఖ (Disabled Welfare Department), రవాణాశాఖ అధికారులు (Transport Department) పరిశీలించారు. జిల్లావ్యాప్తంగా 384 దరఖాస్తులు అందగా 359 మంది హాజరయ్యారు. ఇందులో అర్హులను గుర్తించి ప్రభుత్వానికి అందజేయనున్నారు.
Disability certificates | దివ్యాంగులకు చేయూతనిచ్చేందుకు..
ప్రతి సంవత్సరం దివ్యాంగులకు ప్రభుత్వం మూడు చక్రాల వాహనం, ట్రై సైకిల్, లాప్టాప్ తదితర సహాయ ఉపకరణాలను అందజేస్తుంది. దరఖాస్తుదారుల భౌతిక ధ్రువీకరణ, ధ్రువపత్రాలు తదితరు అంశాలను అధికారులు పరిశీలిస్తారు. దరఖాస్తుదారుల అర్హులు, అనర్హులను గుర్తించి ప్రభుత్వానికి నివేదిస్తారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిణి రసూల్ బీ, జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వరరావు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ప్రతినిధులు డాక్టర్ సామ్రాట్ యాదవ్, డాక్టర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

హాజరైన దివ్యాంగులు