అక్షరటుడే, వెబ్‌డెస్క్:Waaree Energies | వారి ఎనర్జీస్ లిమిటెడ్(Waaree Energies Ltd) కంపెనీ నాలుగో త్రైమాసికంలో దుమ్మురేపింది. నికర లాభం 34 శాతం, ఆదాయం 36 శాతం పెరిగాయి. దీంతో బుధవారం ఈ స్టాక్ ధర 15 శాతం పెరిగింది.
Net profit..
సోలార్ ప్యానెల్(Solar Panel) తయారీ సంస్థ అయిన వారీ ఎనర్జీస్ లిమిటెడ్ మంగళవారం నాలుగో త్రైమాసికానికి(4th Quarter) సంబంధించిన ఫలితాలను ప్రకటించింది. అంతకుముందు సంవత్సరంతో పోల్చితే ఈ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 34 వృద్ధిని సాధించి రూ. 618.9 కోట్లకు చేరుకుంది. 2023-24 ఆర్థిక సంవత్సరం(Financial Year) ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.461.5 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
Revenue..
కార్యకలాపాల(Operations) ద్వారా కంపెనీ ఆదాయం 36.4 శాతం పెరిగి రూ. 4,003.9 కోట్లుగా నమోదయ్యింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ. 2,935.8 కోట్లుగా ఉంది.
EBITDA, PAT..
EBITDA 120.6 శాతం వృద్ధి చెంది రూ. 922.6 కోట్లకు చేరుకుంది. ఇది గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ.418.3 కోట్లు.
PAT గత సంవత్సరంతో పోలిస్తే 107.08 శాతం పెరిగి రూ. 1,932.15 కోట్లుగా నమోదయ్యింది.
2024-25 పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ. 14,846 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 27.62 శాతం వృద్ధిని నమోదు చేసింది.
Waaree Energies | స్టాక్ పనితీరు..
వారీ ఎనర్జీస్ లిమిటెడ్ గతేడాది(Last Year) అక్టోబర్‌లో లిస్టయ్యింది. ఈ స్టాక్ లిస్టయ్యాక భారీగా పెరిగింది. గరిష్టంగా రూ. 3,743 ల వరకు పెరిగిన స్టాక్ ధర.. ఇటీవలి కాలంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులతో రూ. 1,809 వరకు పడిపోయింది. తిరిగి కోలుకుంటున్న కంపెనీ.. ఆదివారం ఏకంగా 15 శాతం పెరగడంతో రూ. 3,008 కి చేరుకుంది.