అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Vande Bharat | కేంద్ర ప్రభుత్వం వేగం, సౌకర్యవంతమైన ప్రయాణం కోసం వందేభారత్ రైళ్ల (Vande Bharat Trains)ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. తాజాగా వందేభారత్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. విశాఖ నుంచి సికింద్రాబాద్ వస్తున్న ట్రైన్ తాళ్లపూసపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఎద్దును ఢీకొంది. ప్రమాదంలో ఎద్దు మృతి చెందగా.. రైలు ఇంజిన్ (Train Engine) ముందు భాగం దెబ్బతింది. గతంలో గేదెలను ఢీకొనడంతో ఇంజిన్ ముందు భాగం ధ్వంసం కాగా తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఎద్దును ఢీకొనడంతో కొద్దిసేపు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు నిలిచిపోయింది. అనంతరం అధికారులు రైలును పంపించేశారు.
Vande Bharat | చీరాలలో కుక్కను ఢీకొని..
ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల (Bapatla) జిల్లా చీరాలలో వందేభారత్ రైలు నిలిచిపోయింది. ట్రైన్ కుక్కును ఢీకొనడంతో ఎయిర్ బ్రేక్‌కు అంతరాయం కలిగింది. దీంతో 27 నిమిషాల పాటు వందేభారత్ రైలు ఆగిపోయింది. విజయవాడ నుంచి చెన్నై వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
Read all the Latest News on Aksharatoday.in